మెల్‌బోర్న్‌లో బిగ్‌ఫైట్.. తెరపైకి ఆర్మీ రచ్చ..

బిగ్‌బాస్ 2 విజేత కౌశల్‌ని ఆర్మీ గెలిపించిన విషయం బుల్లి తెర ప్రేక్షకులు జీర్ణించుకున్నా, బిగ్ బాస్ ఇంటి సభ్యులు మాత్రం కౌశల్ మీద అవకాశం వచ్చినప్పుడల్లా ఫైర్ అవుతున్నారు. 16 మంది ఇంటి సభ్యుల్లో ఒకరైన బాబు గోగినేని ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.

కౌశల్ బిగ్‌బాస్ షోలోకి రాకముందే ఆర్మీ ఏర్పాటు చేసుకున్నాడని, ఆ తరువాత అతడి కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ ప్రకారం ఆర్మీని నడిపించారని బాబు ఆరోపించారు. అది పెయిడ్ ఆర్మీ అని బాబు గోగినేని సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మెల్‌బోర్న్‌లో డిబేట్ జరిగింది.

ఇందులో కౌశల్ ఆయన భార్య నీలిమతో పాటు బాబు గోగినేని, కిరిటీ దామరాజు పాల్గొన్నారు. బాబు ఆరోపణలకు కౌశల్ భార్య నీలిమ కౌంటర్లు ఇచ్చారు. డబ్బులిచ్చి ఆర్మీ రన్ చేశారని బాబు అంటే దానికి నీలిమ మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించమని అడిగారు.

కొన్ని వేల అకౌంట్స్ కౌశల్ ఆర్మీ పేరు మీద ఉన్నాయి అవన్నీ అతడే క్రియేట్ చేశారా అని బాబు అడిగితే ఏదో ఫేస్‌బుక్ పేజీ పట్టుకుని కౌశల్ క్రియేట్ చేశారని ఎలా అంటారంటూ నీలిమ ఫైర్ అయ్యారు. ఫేస్ బుక్ ఆపరేట్ మీకు తెలియదేమో అని బాబుని నీలిమ ప్రశ్నించారు. ఎవరు ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా పేరు మార్చుకోవచ్చు.

ఆ విషయం స్కూలు పిల్లలకు కూడా తెలుసు అని నీలిమ వ్యాఖ్యానించారు. అయినా మే 30 వరకు కౌశల్ గేమ్‌కి వస్తున్నట్లు ఆయననకే తెలియదు. అలాంటిది ముందే ఆర్మీ మొదలైందని మీరు ఎలా చెప్పగలరంటూ బాబుని నీలిమ ప్రశ్నించారు. ఈలోపు కౌశల్ కల్పించుకుని మీరన్నట్లు ఆర్మీ ఫామ్ అయిందనే అనుకుందాం.

లోపలికి వెళ్లిన తరువాత కిరీటికి డబ్బులిచ్చి నా కళ్లలో నిమ్మకాయ పిండు అని చెప్పానా అని హౌస్‌లో జరిగిన ఓ సంఘటనని గుర్తు చేసుకున్నారు. నన్ను ఒంటరిని చేసి ఆడుకున్నారు కాబట్టే నాకు ఆర్మీ ఫామ్ అయిందని కౌశల్ అన్నారు. ముందే ఆర్మీ క్రియేట్ అయింది అనడానికి తన దగ్గర చాలా ఫ్రూఫ్స్ ఉన్నాయంటూ బాబు ఫేస్‌బుక్‌లో అకౌంట్ క్రియేట్ అయిన తేదీలను చూపించారు. మొత్తానికి వీరి డిస్కషన్‌ని మెల్‌బోర్న్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.

మహేష్ అమ్మానాన్న..

అందాల నటుడు మహేష్‌కి అమ్మానాన్నగా నటించేందుకు ప్రకాష్ రాజ్, జయసుధలు మరోసారి తెరపైకి వస్తున్నారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఈ జంట మహేష్ తల్లిదండ్రులుగా జీవించారు. తాజాగా మరోసారి ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.

సహజనటి జయసుధ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహర్షి సినిమాలో మహేష్ పక్కన పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

బిగ్‌బాస్ విన్నర్.. బాబు గోగినేని ఆన్సర్

దాదాపు 60 రోజులకు పైగా బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యుడిగా ఉన్న బాబు గోగినేని ఎలిమినేట్ అయ్యారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నామని హౌస్‌లోని సభ్యులు అన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కౌశ‌ల్‌ని టార్గెట్ చేస్తున్నారన్న మాటకి వివరణ ఇచ్చుకున్నారు. అది టార్గెట్ కాదని నిరసన అని తెలిపారు. కౌశల్ తనకి కాంపిటేషన్ అని అనుకోలేదన్నారు. తాను చివరి దాకా ఉంటానన్న నమ్మకం కానీ, కోరిక కానీ లేదన్నారు.

అయితే కౌశల్ మిగిలిన వారందరికీ ఓ టఫ్ కాంపిటేటర్ అని మాత్రం చెప్పగలనన్నారు. అతడు ఫైనలిస్టులో ఒకడిగా ఉంటాడన్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. బయటకు వచ్చిన తరువాత తెలిసింది కౌశల్‌కి సపోర్టు చాలా ఉందని అన్నారు. ఆయన్ను గెలవనివండి.. ఎవరో ఒకరు గేమ్‌లో విన్నర్ అవ్వాలి కదా అన్నారు బాబు గోగినేని చాలా కూల్‌గా.

సితార నాన్న కూచి.. అడిగింది కాదంటే ఎలా..

ప్రిన్స్ మహేష్ భార్యా పిల్లలతో కలిసి గోవాలో సందడి చేస్తున్నట్లున్నారు. అక్కడ ఓ సాయింత్రాన్ని సరదాగా గడిపేస్తున్నారు. పిల్లలు గౌతమ్, సితారలకు ఏదో నచ్చి ఉంటుంది. అమ్మని అడిగితే కాదన్నది. నాన్న దగ్గరకి వెళితే ఓకే చెప్పేస్తారు రమ్మంటూ అన్నని లాక్కెళ్లిందేమో క్యూట్ బేబి సితార.

తన ముద్దు ముద్దు మాటలతో నాన్న దగ్గర గారాలు పోయేసరికి కాదనడం మహేష్ వల్ల అవుతుందా. సరే బంగారు.. నీకిది కావాలి.. అంతేకదా.. అమ్మకి చెప్పకండి.. నేను కొనిచ్చేస్తాను అని అన్నట్లుంది కదూ ఈ ఫోటో. పిల్లల ఆటలు తన దగ్గర సాగవని నాన్న వద్ద పంచాయితీ పెట్టారని నమ్రత ఈ ముగ్గుర్నీ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

 

Striking deals with the dad !! As mom said NO????????

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

ఈ క్యూట్ పిక్ వైరల్ అవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహేష్ కొత్త చిత్రం ‘మహర్షి’ టీజర్‌లో ఓ కొత్తలుక్‌లో కనిపిస్తున్న మహేష్‌ని చూసి కాలేజీ అమ్మాయిలు ఈగర్లీ వెయిటింగ్.

బిగ్‌బాస్ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు.. ఈసారి బాబూ ‘గోగినేని’..

ఒకే ఇంట్లో రోజూ కలిసి ఉంటేనే ఏదో చిన్నా చితకా గొడవలు వస్తుంటాయి. అలాంటిది ఇన్ని రోజులు డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న వ్యక్తులు ఒకే కప్పుకింద ఉండాలంటే.. మంచి వాళ్లుగా నిరూపించుకోవడానికి ప్రతి మనిషీ తాపత్రయపడతారు. అందుకోసం అసలు రూపాన్ని కప్పేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. కానీ ఎన్నాళ్లు తనలో ఉన్న భావోద్వేగాల్ని కప్పి పుచ్చుకుంటారు. ఏదో ఒకరోజు అది బరస్ట్ అవుతుంది. అప్పుడే అసలు వ్యక్తిత్వాలు బయట పడుతుంటాయి.

బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్‌లో ఇంటి సభ్యులు సరదాగా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడంతో అది కాస్తా పెద్దదవుతోంది. నా గురించి నువ్వేంటి మాట్లాడేది అనేదాకా వెళుతున్నారు. మొత్తానికి రసవత్తరంగా సాగుతోంది బిగ్ బాస్ ఇంటి గొడవ.

గీతా మాధురి, బాబు గోగినేని మధ్య జరుగుతున్న చర్చ వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెటిజన్స్ బాబుపై ఫైర్ అవుతున్నారు. హూందాగా వ్యవహరించడంలేదని అంటున్నారు. ఇన్ని రోజులుగా బాబుపై ఎంతో గౌరవం వుండేదని అది కాస్తా పోగొట్టుకున్నారని నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గీతా మాధురి కన్నీళ్లు, బాబు గోగినేని ఆవేశంతో అన్నమాటలు బిగ్ బాస్ హౌస్‌లో ఏంజరగబోతోందో అనే ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో.