కోడలు గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా..కాలితో తన్నిన అత్త!

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం ఓ మహిళను భర్త, అత్త కలిసి చిత్రహింసలు పెట్టారు. గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా కోడలిని కాలితో తన్నింది ఆ అత్త! తల్ల చేష్టలకు అడ్డు చెప్పకపోగా…భార్య మరణికట్టుపై బ్లేడ్‌తో కోసి దాడి చేశాడు భర్త! అయితే.. ఆ రాక్షసుల నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఆసుపత్రిలో చేరింది

విశాఖ జిల్లా పెందుర్తిలో గురజాల దామోదర్‌…… తన భార్య రాజేశ్వరిని చిత్ర హింసలు పెడుతున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడు. అతడికి తల్లి లలిత కూడా వత్తాసు పలికింది. అరోనెల అని తెలిసినా బిడ్డను కనొద్దంటూ అత్త లలిత కడుపులో గుద్దినట్టు బాధితురాలు చెప్పారు. 25 లక్షలు కట్నం ఇస్తేనే పిల్లలను కనాలని కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ….

కట్నం తీసుకురాకుంటే… అబార్షన్‌ చేయించుకోవాలంటూ.. భర్త దామోదర్‌, అత్త లలిత బెదిరించారు. ఇప్పటికే మూడు సార్లు అబార్షన్‌ చేయించినట్లు తెలుస్తోంది. మరోసారి అబార్షన్‌ చేయించుకోవాలంటూ రాజేశ్వరిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కారులోనే ఆమెపై దాడికి తెగబడ్డారు. చేతులపై బ్లేడ్‌తో గాయాలు చేశారు. పొట్టపై కూడా దాడి చేశారు.భర్త, అత్త పెట్టిన చిత్రహింసలతో తీవ్రంగా గాయపడింది రాజేశ్వరి….

స్థానికల సహాయంతో .. భర్తను నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చేరింది బాధితురాలు. ప్రస్తుతం కేజీహెచ్‌ లో చికిత్స పొందుతుంది. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అత్త, భర్తపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు పోలీసులు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ….

భర్త వివాహేతర సంబంధాన్ని తెలుసుకున్న భార్యను..

భర్త వివాహేతర సంబంధాన్పి ప్రశ్నించినందుకు భార్యని హత్య చేశాడో ఆర్మీ మ్యాన్. ఈ సంఘటన తమిళనాడులోని గురుపరపల్లిలో చోటుచేసుకుంది. కృష్ణగిరి జిల్లా గురుపరపల్లికి చెందిన రాజేష్‌ ..గౌతమిని 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజేష్‌ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాజేష్‌ కలైవాణి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారి సంబంధంపై భర్తను గౌతమి నిలదీసింది. ఈ విషయంపై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. సెలవుల అనంతరం తిరిగి డ్యూటీలోకి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటి వచ్చిన రాజేష్‌..గౌతమిని హత్య చేపి పరారయ్యాడు. స్ధానికుల సమాచారం తో హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహన్ని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో గౌతమిని భర్తే హత్య చేసినట్లుగా తేలింది. పరారీలో ఉన్న అతను సోమవారం కృష్ణగిరిలో పోలీసులకు పట్టుబడ్డాడు. తన ప్రియురాలు ఒత్తిడి మేరకే భార్య గౌతమిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు.

గుండెలను పిండేసే ఘటన.. భార్యను బతికించాలని భర్త తాపత్రయం చూసి..

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యను కాపాడుకునే ప్రయత్నం చేశాడు భర్త… తుదిశ్వాస వరకు కలిసుంటానన్న తన భార్యకు ఎలాగైనా ప్రాణం పొయ్యాలని నోటితో ఆక్సీజన్‌ అందించే ప్రయత్నం చేశాడు… హృదయవిదారకమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడులో జరిగింది…

మండాలపాడు గ్రామం వద్ద వ్యాను అదుపుతప్పి పల్టీలు కొట్టి ప్రమాదానికి కారణమైంది… ఈ ఘటనలో భూక్యా రాములమ్మ అక్కడికక్కడే మృతిచెందింది… ఘటనా స్థలానికి చేరుకున్న భర్త తన భార్య రాములమ్మను బతికించుకోవాలని పడిన తాపత్రయం అక్కడున్నవారి గుండెలను పిండేసింది… చనిపోయిన భార్య నోట్లో నోరు పెట్టి గాలి ఊదుతూ చేసిన ప్రయత్నం కన్నీటిని పెట్టించాయి…

చెయ్యిపట్టి ఏడడుగులు నడిచిన ఈ జంటను విధి రాత రోడ్డు ప్రమాదంలో వేరు చేసింది… భార్య భర్తల బంధాన్ని విడదీసింది… భార్య చనిపోయినా… తన ప్రయత్నం మాత్రం మానుకోకుండా నోటిలో నోరు పెట్టి ఆక్సీజన్‌ అందించే ప్రయత్నం చేయడం… ఆమెపై తనకున్న ప్రేమను చాటుతుందని ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరు అనుకోకుండా ఉండరు…

పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా..

విశాఖ జిల్లా యలమంచిలిలో దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బైక్‌పై వెళుతోన్న బార్యభర్తలను ఇనుపరాడ్డుతో గాయపరిచి నగలు లాక్కొని పరారయ్యారు.. మరోఘటనలో బైక్‌పై వెళుతోన్న వాయిద్యకళాకారుడిని తీవ్రంగా గాయపరిచి డబ్బుతో పాటు వాయిద్యపరికరాలున్న బ్యాగ్‌ను గుంజుకునిపారిపోయారు . పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వీరంతా ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో దారి దోపిడీకి గురయ్యారు. గాయపడిన బాధితులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దారుణం.. భార్యపై అనుమానంతో..

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో..కత్తితో దాడి చేశాడు ఓ కిరాతక భర్త. ఈ ఘటన వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో జరిగింది. అర్ధరాత్రి గొడవకు దిగిన భర్త బాలకృష్ణ…. భార్య మహేశ్వరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో మహేశ్వరి తీవ్రంగా గాయపడింది. తనను కాపాడాలంటూ… తన తమ్ముడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.

అనుమానంతోనే… కట్టుకున్న భార్యను కడతేర్చాలుకున్నాడు భర్త. తీవ్రంగా గాయపడిన మహేశ్వరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… బాలకృష్ణ కోసం గాలిస్తున్నారు.

తెలిసిన బంధువులను కలిసివస్తానని చెప్పి ..

కుటుంబ సభ్యులు వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నిర్మల్‌ పట్టణంలోని శాస్త్రినగర్‌లో చోటు చేసుకుంది.
సోనాకరెడ్డి అనే మహిళకు మూడేళ్ల క్రితం భైంసా మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్‌రెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలం
వీరి సంసారం సాఫీగా సాగింది. తదనంతరం భర్త ఆమెను వేధించడం మెదలుపెట్టాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన మౌనిక అత్తింటి నుంచి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.అయితే బుధవారం తెలిసిన బంధువులను కలిసివస్తానని తల్లికి చేప్పి వెళ్లిన సోనిక అనంతరం అపార్ట్‌మెంట్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎతైన భవనం నుంచి దూకడంతో తలకు బలమైన గాయం కావడం వల్ల ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మౌనిక దూకిన బిల్డింగ్‌పై కూల్‌డ్రింక్‌ సీసా ఉండడంతో ఈ అనుమానలను బలపరుస్తున్నాయి. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . పోస్టుమార్టం బాడీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సరూర్‌నగర్‌లో విషాదం..ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కర్మన్‌ఘాట్‌ సాయినగర్‌లో రజిత,సంతోష్‌ భార్యభర్తలు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. గుండె నొప్పితో బాధపడ్తున్న ప్రభాకర్ కు డాక్టర్ స్టంట్‌ వేశారు. అయితే చికిత్స అందించేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆయన చనిపోయాడని బంధువులు ఆందోళన చేశారు.
……….
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో ఓ వివాహితపై నడిరోడ్డుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన ఆమె ఘటనాస్థలంలోనే చనిపోయింది. మృతిరాలిని పీఆర్ గూడెంలో పని చేస్తున్న స్టాఫ్ నర్స్ గా గుర్తించారు.
…………..
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తుఫాన్‌గా మారనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నాయి.
……………
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గంటకు 100 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
……………..

దారుణం.. మద్యం మత్తులో భార్యపై..

హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. శంకర్‌నగర్‌లో గణేష్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య సంధ్య, కుమారుడు యోగిరాజ్‌పై కత్తితో దాడి చేశారు. మద్యం మత్తులో ఇతను తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు.

డాక్టర్ వృత్తికే కళంకం.. అదనపు కట్నం కోసం భార్యకి..

పది మందికి ప్రాణం పోసే వృత్తి.. ఆసుపత్రికి వచ్చిన రోగులు డాక్టర్‌నే దేవుడిగా భావిస్తారు. తనలో ఉండాల్సిన మానవత్వాన్ని నిద్రపుచ్చి మృగాన్ని నిద్ర లేపాడు. డాక్టర్‌ని అయినంత మాత్రాన నేనేమి స్పెషల్ కాదు. అందరి లాంటి వ్యక్తినే అని నిరూపించాడు. డాక్టర్ కావడంతో తన తెలివి తేటలు ఉపయోగించి భార్యకు హెచ్‌ఐవీ ఇంజక్షన్ ఇచ్చాడు.

మహారాష్ట్ర పూణే నగరంలోని పింప్రీ చించ్వాద్‌లోని పింపుల్ సౌదాగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల మహిళకు 2015లో హోమియో డాక్టరుతో వివాహమైంది. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు కట్నకానుకలు ఇచ్చి వివాహం ఘనంగా జరిపించారు. కొద్ది కాలం సంసారం బాగానే సాగింది. అనంతరం అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు.

అప్పటికీ ఆమె ఒకసారి పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి భర్త చేతికి ఇచ్చింది. అయినా ఇంకా డబ్బు కావాలని అడగడంతో ఎదురు తిరగడం మొదలు పెట్టింది. దీంతో భార్యని విడాకులు ఇవ్వమని వేధించడం ప్రారంభించాడు. దానికి ఆమె ససేమిరా అనడంతో డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చే పని చేశాడు. భార్యకు బలవంతంగా హెచ్‌ఐవి ఇంజక్షన్ ఇచ్చాడు.

వద్దని ఎంత ప్రాధేయ పడ్డా వినలేదు. దీంతో భర్తపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆమెను వైద్యుల వద్దకు పంపి ఆమె ఇచ్చిన ఫిర్యాదులో నిజా నిజాలు నిర్ధారించుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్ భర్తని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

అమ్మానాన్న కలిసి.. బిడ్డని ఒంటరి చేసి..

ప్రేమించుకున్నారు. కష్టమో, సుఖమో కలిసే బతకాలనుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఎవరి అండ లేకపోయినా ఉన్నదాంట్లోనే సర్థుకుని హాయిగా కాపురం సాగిస్తున్నారు. విధి వైచిత్రం.. వేర్వేరు సంఘటనల్లో భార్యాభర్తలిద్దరినీ ఒకేసారి మృత్యుఒడికి చేర్చింది. అప్పుడే పుట్టిన బిడ్డని ఒంటరిని చేసింది.

హర్యానాలోని దడౌలీ గ్రామానికి చెందిన రేషన్‌లాల్, అదే ఊరికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇంట్లోని పెద్దవారిని అడిగారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే భార్య గర్భం దాల్చింది.

నెలలు నిండడంతో ఆమెను డెలివరీ కోసం ఆగ్రోహ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు భర్త రేషన్‌లాల్. అక్కడ భార్యను జాయిన్ చేసి మళ్లీ ఇంటికి వస్తున్నాడు ఆమెకు ఆహారం తీసుకువెళదామని. ఇంతలోనే అతడి ద్విచక్రవాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ రేషన్‌లాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఇదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న భార్య బిడ్డకు జన్మనిచ్చింది. అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. బిడ్డని స్పృశించి ఆమె కూడా కన్నుమూసింది.

సంఘటన తెలుసుకున్న ఇరుకుంటుంబాల వారు వచ్చి ఆసుపత్రి వద్ద రోదిస్తున్నారు. కాగా, ఆ దంపతులకు పుట్టిన శిశువు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది.