తాము చదువుకున్న పాఠశాల గదిలోకి వెళ్లి..

ముందు ప్రేమించుకున్నారు. ఆ తరువాత గొడవపడ్డారు. మళ్లీ ప్రేమ పాఠాలు వల్లె వేశారు. పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే అన్న అనుమానం వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన కనకయ్య, తారలు పురుగుమందు తాగి వారు చదువుకున్న స్కూల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ముంజె కనకయ్య అదే గ్రామానికి చెందిన రాచకొండ తార ఇద్దరు కలిసి స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నారు.

కనకయ్య తొమ్మిదో తరగతితో ఆపేస్తే తార పదోతరగతి పూర్తి చేసింది. ఆసమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కనకయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తూ తండ్రికి సాయంగా ఉంటున్నాడు. తార టైలరింగ్‌లో శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ ఓ రోజు గొడవపడ్డారు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ కనకయ్య మీద కంప్లైంట్ ఇచ్చింది తార గ్రామంలోని పెద్దలకు. వారు పంచాయితీ పెట్టి ఎవరి దారి వాళ్లని చూసుకోమన్నారు. ఒకరి విషయాల్లో ఒకరి జోక్యం తగదన్నారు. తారని వేధింపులకు గురిచేసినందుకుగాను కనకయ్య కుటుంబానికి రూ.30 వేల జరిమానా కూడా విధించారు. కొన్నాళ్లు దూరంగా ఉన్నా మళ్లీ తరువాత తార, కనకయ్యలు కలుసుకోవడం మొదలు పెట్టారు.

ఈసారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత పరిస్థితికి వచ్చింది ఇద్దరికీ. కులాలు వేరు. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే అనుమానం. కలిసి ఎలాగూ బ్రతికే పరిస్థితి లేదని కలిసి చావాలనుకున్నారు. అందుకోసం బుధవారం ఇంటినుంచి బయలుదేరి తాము చదివిన పాఠశాలకు వచ్చారు. అక్కడ ఇద్దరూ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగారు. ఆపై తమ తరగతి గదిలో ఉన్న ఒకే కొక్కానికి తాడుతో ఉరి వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దారుణం: తాగిన మత్తులో ఓ తండ్రి ఇద్దరు కూతుళ్లను..

ఇద్దరు కూతుళ్లకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఈసంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో చోటు చేసుకుంది. బ్రెయిన్‌ ట్యూమర్‌తో తన భార్య లక్ష్మీ మృతి చెందింది. గ్యాస్‌స్టవ్‌లు రిపేర్‌ చేసుకుంటూ తన ఇద్దరు కూతుళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు బడుగు రాజు. ఇదే క్రమంలో రాత్రి ఇంట్లో తాగిన మత్తులో ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపాడు. తాను నోటిలో గుడ్డలు పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేసి..అంతలోనే..

ఫలితాలు వచ్చి… ఫెయిల్‌ అయిన వారు బలవన్మరణానికి పాల్పడితే.. ఫలితాలు రాకముందే ఆత్మహత్య చేసుకున్నాడు 10వ తరగతి విద్యార్థి. హైదరాబాద్‌ ఉప్పుగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేసిన నరేష్‌ అనే విద్యార్థి… ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పరీక్షలు తప్పుతాననే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు చెబుతున్నారు. నరేష్‌ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఆర్నెల్లుగా ఏడ్వని రోజు లేదు..అతణ్ని, అతడి కుటుంబాన్ని వదలొద్దు

 
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడులో దారుణం చోటుచేసుకుంది. పోకబత్తిని నందిని అనే యువతి పురుగులు మందు తాగి ఆత్మహత్మ చేసుకుంది.ప్రాణంగా ప్రేమించినవాడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన నందిని ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు తేలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల పీహెచ్‌సీలో ఒప్పంద పద్ధతిలో నందిని ల్యాబ్‌ టెక్నీషియన్‌‌గా పనిచేస్తుంది. అయితే ఆమె అంతకుముందు ప్రైవేటు నర్సుగా ఉద్యోగం చేసేది. ఆ సమయంలో నల్గోండకు చెందిన చేగొండి బాలరాజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొద్ది రోజుల తర్వాత నందినికి మాయమాఃటటు చేప్పి శరీరకంగా లోబరుచుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకోమని అడిగితే ఇంటిదగ్గర ఒప్పుకోవడం లేదంటూ సమాధానం ఇచ్చాడు. నువ్వే ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంట్లో వాళ్ళను ఒప్పించాలి అన్నాడు. చివరకు నందిని వెళ్లి అతడి కుటుంబ సభ్యుల్ని అభ్యర్థించింది. వారు ఆమెతో దుర్భాషలాడి ఇంటి నుంచి గెంటేశారు. ఈ విషయాన్ని నందిని బాలరాజుకు చేప్పగా నేనేమి చేయలేనంటూ చేతులెత్తేశాడు. తనను వదిలేసి పొమ్మన్నాడు.

రెండు నెలల తర్వాత బాలరాజు సోదరుడు నందిని ఇంటికి వచ్చి ఆమె సెల్ ఫోన్‌లో ఉన్న ఫొటోలు, ఆధారాలు తొలగించి ఫోన్‌ పగలగొట్టిపోయాడు. దీంతో ఆమె అతనిపై ఫిబ్రవరి 13న స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలారాజును పిలిచి వివరణ కోరగా స్పందన లేదు. అనంతరం బాలరాజు నుంచి బెదిరింపులు, వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన నందిని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ‘ఆర్నెల్లుగా ఏడ్వని రోజు లేదు. చదువే లోకంగా ఉద్యోగమే ధ్యాసగా ఉన్న నా జీవితంలోకి వచ్చిన మోసగాడు నన్ను నా కుటుంబానికి దూరం చేస్తున్నాడు. అతణ్ని, అతడి కుటుంబాన్ని వదలొద్దు.’’అంటూ ఆత్మహత్య లేఖ రాసింది.ఇంతటి దారుణం జరగడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విషయంలో పోలీసులు సరైన విధంగా స్పందించకపోవడంతోనే నందిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు గరిడేపల్లి ఠాణా ఎదురుగా గురువారం రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. నిందుతున్ని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

అక్కని గర్భవతిని చేసి.. చెల్లితో జంప్.. చివరకు..

ఇది కథ కాదు ఓ ఇల్లాలి వ్యథ. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ‘నువ్వు లేక నేను’, అంటూ సినిమా డైలాగులతో లవ్వాడుకున్నారు. వీరిద్దరూ ఒకే సామాజిక
వర్గానికి చెందిన వారు కావటంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారని ఆశపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది. వీరి ప్రేమను అబ్బాయి కుటుంబంలో అంగీకరించలేదు. కారణం అమ్మాయి కుటుంబానికి ఆస్తి తక్కువగా ఉండటమే. ఆస్తి లేదని చెబితే గొడవ చేస్తారనకున్నారు. అందుకే అమ్మాయి వయస్సు తక్కువగా ఉందనే సాకు చూపించారు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అబ్బాయి తరుపు వారు ఏ అమ్మాయిని అయితే వద్దు అనుకున్నారో ఆమె చిన్నాన్న కూతురినే కోడలిగా చేసుకున్నారు.

కట్ చేస్తే.. వీరికి పెళ్లై 9 నెలలు గడిచాయి. ఆమె గర్భవతి అయింది. కానీ అతడు మాత్రం తన ప్రేమను మర్చిపోలేదు. అందుకే తన ప్రేయసితో పారిపోయాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకుని.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం, కంటేపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రెండు మృతదేహాలు కనిపించాయి. మృతదేహాల మీద వున్న గుర్తుల ఆధారంగా వీరిని గుర్తించిన పోలీసులు.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Also Read : 10 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన 12 ఏళ్ల కుర్రాడు

అందరికీ తెలిసిందనే మనస్తాపంతో ..

పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఓ వైద్యవిద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని బళ్ళారిలో చోటుచేసుకుంది.
బళ్ళారిలోని కృష్ణానగర్‌ చెందిన శ్రీనివాసరావు కూమర్తె ఎ.దివ్య నిమ్స్‌ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ మూడవ సంవత్సరం చదువుతోంది. ఇటివలే దివ్య
ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. వాటి ఫలితాలు బుధవారం రోజు వెలువడ్డాయి. ఈ ఫలితాలలో దివ్య ఫెయిల్‌ అయింది. తను ఫరీక్షల్లో తప్పననే విషయం అందరకీ తేలియడంతో మనస్తాపం చెందిన ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఉదయం దివ్య ఎంతకీ ఆమె గది డోర్ తెరవకపోవడంతో తల్లిదండ్రులు తలుపు పగలగోట్టి లోపాల వేళ్ళి చూడగా తాడుకు వేలాడుతూ కనిపించింది. దీంతో వారు వెంటనే విమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొన్నారు. దివ్య కుటుంబాన్ని స్థానిక ఎమ్మేల్యే శ్రీరాములు విమ్స్‌ మార్చురీకి చేరుకొని తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు.

కాపురంలో చిచ్చు..పిల్లలను హత్య చేసి చివరకు తాను కూడా..

వారి కుటుంబంలో ఏర్పాడ్డ కలహాలు ముగ్గురు ప్రాణాలను తీసింది. ఓ తల్లి తన ఇద్దరి పిల్లలను చంపి అనంతరం ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం కర్ణాటకలో చోటుచేసుకుంది. ఆశా,మహేశ్‌ దంపతులు బండిపాళ్యంలో ప్రాంతంలో నివిస్తుండేవారు. వీరికి శౌర్య(8),సుప్రీత్‌(8) అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం ఈ గొడవలు త్రీవ స్ధాయికి చేరడంతో మనస్తాపం చెందిన ఆశా భర్త ఇంట్లో లేని సమయంలో తన ఇద్దరి పిల్లలను హత్య చేసి తాను ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన మహేశ్ భార్య ఎంత పిలిచిన తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలపులు పగలగొట్టి లోపలికి వేళ్ళి చూడగా భార్య,పిల్లలు విగతజీవులుగా పడివున్నారు.

ఘటన స్ధలికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి సుసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరు కారణం కాదంటూ తన చేసిన పని వల్ల
కులుంబానికి అవమానం జరిగిందనే బాధతోనే పిల్లలను హత్య చేసి తను ఆత్మహత్యకు పాల్పడ్డట్లు డెత్‌నోట్‌లో వ్రాసి ఉంది. అలాగే పిల్లలను తనను ఒకే చితిలో దహనం చేయాలని ఆశా అందులో రాసారు. వీరి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దలు చేసిన పాపం..కన్న కూతురి..

విశాఖపట్నంలో పెద్దల మొండితనం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. ఇష్టం లేని వ్యక్తితో నిశ్చితార్థం ఖరారు చేయటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. విశాఖ మల్కాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురు ప్రేమని నిరాకరించిన తల్లిదండ్రులు వేరే వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించటమే ఈ దారుణానికి దారితీసింది.

మల్కాపురానికి చెందిన దేవి, జై ఆంధ్రా కాలనీకి చెందిన అరవింద్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే..వారి ప్రేమ వ్యవహారం దేవి కుటుంబ సభ్యులకు తెలియటంతో కష్టాలు మొదలయ్యాయి. దేవిని కట్టడి చేసిన ఆమె కటుంబసభ్యులు..వేరే వ్యక్తితో నిశ్చితార్థం కూడా నిర్ణయించారు. దీంతో అరవింద్, దేవి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. వేర్వేరు చోట్ల ఊరివేసుకున్నారు. దేవి మరణించగా..అరవింద్ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గర్భం ఉండాలని భార్య, వద్దని భర్త..చివరకు ఆమె..

కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది..బనగానపల్లె మండలం పండ్ల పురం గ్రామంలో అర్ధరాత్రి 6 నెలల గర్భిణీ ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది.ఇంట్లో ఉన్న డీజిల్ పోసుకుని నిప్పు పెట్టుకుంది.

బనగానపల్లె మండలం, పండ్లపురం గ్రామానికి చెందిన బోయ శివరామయ్య వెంకట లక్ష్మమ్మకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.పొలం పనులతో పాటు ట్రాక్టర్ ఆటో నడుపుకొని జీవనం సాగించేవాడు శివరమయ్య. వీరికి 12 ఏళ్ల కొడుకు కళ్యాన్ ,9 ఏళ్ల పావని సంతానం..ఇప్పుడు లక్ష్మమ్మ 6 నెలల గర్భవతి.. ఇద్దరు పిల్లలు ఉండగా మరో సంతానం వద్దు అని బార్యభర్తలు నిత్యం గొడవ పడేవారు.గర్భం ఉండాలని భార్య, వద్దు తీసేసుకోవలని గొడవ పడేవారు..గతంలో ఒకసారి ఇలాగే గర్భం తీయించుకున్న లక్ష్మమ్మ ఈ సారి కడుపులో బిడ్డను చంపుకోలేనని భర్తకు చెప్పింది.ఇదే విషయం పై నిన్న పెద్దల వద్ద పంచాయితీ జరిగింది..6 నెలల గర్భవతి కడుపు తీపించుకుంటే తల్లి ప్రాణాలకు ప్రమాదం అని పెద్దలు చెప్పారు.

నిన్న అర్ధరాత్రి భర్త శివరామయ్య పొలం దగ్గర పడుకోవడానికి వెళ్లగా లక్ష్మమ్మ ఇంట్లో ఉన్న డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తమామలు చెబుతున్నారు.భర్త శివరామయ్యా పరారీలో ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.భార్య పిల్లలపై డీజిల్ పోసి భర్తే చంపి ఉంటాడని మెరితురాలి బంధువుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు..

ప్రియుడి తండ్రి బలవన్మరణానికి కారణమైన ప్రియురాలు ఆత్మహత్య

బలవన్మరణానికి పాల్పడింది. తదితర పరిణామాల అనంతరం ఆ యువతి, ఆమె ప్రియుడు కుటుంబల మధ్య జరిగిన గోడువల కారణంగా ప్రియుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల కథనం ప్రకారం. పాలంపేటకు చెందిన బోడ సింధూజ, కొండబత్తుల రమేష్‌ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతోవారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి చెందిన సింధూజ ఈ నెల 14న పురుగుల మందు తాగింది. అనంతరం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పోందుతూ మృతి చెందింది. దీంతో అగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని రమేష్‌ ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకోని వివాదం సద్దుమణిగెల చేశారు. యువతి బంధువులు అసభ్య పదజాలంతో రమేష్‌ తండ్రి రాజుని నిందించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ప్రేమ రెండు కుటుంబాలలో విషాదం చోటుచేసుకుంది.