మహేశ్ బాబు Vs దేత్తడి హారిక: పర్యాటక శాఖ వివరణ

మహేశ్ బాబు Vs దేత్తడి హారిక: పర్యాటక శాఖ వివరణ

మొన్న తీసుకున్నారని, నిన్న తొలగించారని సోషల్ మీడియాలో వార్తలు.. ఏది నమ్మాలో తెలియని సందిగ్ధం.. దీంతో పర్యాటక శాఖ అధ్యక్షుడు రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే తెలంగాణ పర్యాటక శాఖ ప్రచారకర్తగా యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక నియమించినట్లు మొన్నటి వార్త.. హారికకు నియామక పత్రం ఇస్తూ దిగిన ఫోటో కూడా ఒకటి మీడియాలో వచ్చింది.

ఇక దాంతో ఆమె ఏం చేసిందని, ఆమెకి ఎందుకు ఆ పోస్ట్ ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక మరుసటి రోజు ఆమెను తొలగించారంటూ మరో వార్త హోరెత్తింది. ఈ గజిబిజి గందరగోళానికి వివరణ ఇచ్చారు టీఎస్టీడీసి అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ హారిక నియామకంపై స్పష్టత ఇచ్చారు.

హారికను తొలగించారంటూ వస్తున్న కథనాలను ఖండించారు. తక్కువ ఖర్చుతో రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రచారం చేసుకునేందుకు ఆమెను ఎంపిక చేశామని అన్నారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మహేశ్ బాబు వంటి హీరోలతో ప్రచారం చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.. అన్ని నిధులు పర్యాటక శాఖ వద్ద లేవని అన్నారు. అందుకే యూట్యూబ్ స్టార్ హారిక అయితే తక్కువ ఖర్చుతో అయిపోతుందని ఆమెని ఎంపిక చేశామని వివరణ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story