గ్రేట్ బామ్మా... వందేళ్ళ వయసులో కరోనాని తరిమికొట్టింది

గ్రేట్ బామ్మా... వందేళ్ళ వయసులో కరోనాని తరిమికొట్టింది
ఆ మాటకు వస్తే.. వారే యూత్ కి దైర్యం చెబుతున్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశాం..ఎన్నో రకాల వ్యాధులతో పోరాడం..ఇప్పుడు కరోనాకు కూడా అంతే.

కరోనా పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతోంది చాలామందికి.. వయసుతో సంబంధం లేకుండా యూత్ కూడా ఆందోళన చెందుతుంది. ఏ చిన్న లక్షణం కనిపించినా సరే.. అదే కరొనా ఏమో అని టెన్షన్ పుడుతుంది. వాళ్ళ స్థితి ఇలా ఉంటే.. వృద్ధుల సంగతేంటి ? కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.. యువతరం ఢీలా పడుతుందేమో కానీ ఓల్డెన్ ఎజ్ లో ఉన్నవారు మాత్రం అస్సలు బయటపడడం లేదు.

ఆ మాటకు వస్తే.. వారే యూత్ కి దైర్యం చెబుతున్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశాం..ఎన్నో రకాల వ్యాధులతో పోరాడం..ఇప్పుడు కరోనాకు కూడా అంతే. దీనికే ఆందోళన చెందితే ఎలా బతకగలం... ధైర్యంగా ఉండండి.. బంగారంలాంటి భవిష్యత్తు ముందుంది అంటూ భరోసా ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఓ వందేళ్ల వృద్ధురాలు మాటలు వింటుంటే కరోనా పైన ఈజీగానే విజయం సాధించవచ్చని నమ్మకం కలుగుతోంది. హైదరాబాదు లోని సరూర్ నగర్లో ఉంటున్న ఆండాళమ్మ వైరస్ ను ఓడించి కరోనా పైన విజయం సాధించింది.

కరోనాను జయించిన శతాధిక వృద్ధురాలు.. ఈ మాట చాలా దైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే వందేళ్ల వయసులో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉండదు. అంటే కరోనా పై పోరాటం చేయడం అంత సులువు కాదు.. ఇమ్యునిటీ పవర్ ఎక్కువగా ఉండే యువతరమే కరోనా దాటికి తట్టుకోలేకపోతోంది. మరి అలాంటప్పుడు ఆ బామ్మ ఎలా పోరాడింది నిజంగా ఆమె చేసిన యుద్ధం, సాధించిన విజయం అందరికీ ఆదర్శప్రాయం.

కరోనా వచ్చిందని భయపడకుండా డాక్టర్ల సలహాలతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంది. వైద్యులు చెప్పిన మందులు వాడుతూ భగవంతుడు ధ్యానంతోనే ధైర్యంగా ఉంది . అంటే ఇక్కడ శారీరక బలం కన్నా ఆమె మానసిక బలమే కరోనా పైన విజయం సాధించేలా చేసింది.


గ్రేట్


Tags

Read MoreRead Less
Next Story