చదివేది తొమ్మిది.. సౌరవిద్యుత్‌తో సైకిల్ తయారు చేసి..

చదివేది తొమ్మిది.. సౌరవిద్యుత్‌తో సైకిల్ తయారు చేసి..
టెక్నికల్ స్టూడెంట్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా సోలార్ పవర్‌తో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు.

అస్తమాను అది పీకి ఇది, ఇది పీకి అది చేస్తుంటే ఇంట్లో అమ్మానాన్న వారించే వారు. కానీ కొడుకులో ఏదో టాలెంట్ ఉందని చిన్నప్పుడే గుర్తించారు. అనుకున్నట్లుగానే 14 ఏళ్ల వయసుకే సౌర విద్యుత్‌తో సైకిల్ తయారు చశాడు శివ కుమార్. అందరి చేతా శెభాష్ అనిపించుకుంటున్నాడు. పెద్ద పల్లి జిల్లా గోదావరి ఖని తిలక్ నగర్‌కు చెందిన బాల శివ కుమార్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.

ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు సాంకేతిక విద్యపై పట్టు సాధించాడు. టెక్నికల్ స్టూడెంట్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా సోలార్ పవర్‌తో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు. అమ్మానాన్న దగ్గర 5వేల రూపాయలు అడిగి తీసుకుని సోలార్ ప్లేట్, బ్యాటరీ సైకిల్ తయారీకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసి సౌర విద్యుత్‌ను బ్యాటరీల ద్వారా మోటార్‌కు కనెక్ట్ చేశాడు.

హ్యాండిల్‌కు ఉన్న సెల్ఫ్ స్విచ్‌తో మోటార్‌కు అనుసంధానం చేశాడు. హ్యాండిల్‌కు ఉన్న సెల్ఫ్ స్విచ్‌తో మోటార్ రన్ అయ్యేవిధంగా కనెక్షన్ ఇచ్చి సైకిల్‌ను మూవ్ చేశాడు. సైకిల్‌కు అమర్చిన 2 బ్యాటరీలతో 10 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని శివకుమార్ పేర్కొన్నాడు. శివ సౌర విద్యుత్‌తో సైకిల్ తయారు చేశాడని తెలుసుకుని ఊరివాళ్లంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారికి మరింత ప్రోత్సాహం అందితే అద్భుత ఆవిష్కరణలు అందించగలరని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story