TS corona Cases : తెలంగాణలో 3,308 కేసులు..21 మంది మృతి..!

TS corona Cases : తెలంగాణలో 3,308 కేసులు..21 మంది మృతి..!
TS corona Cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63,120 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 3,308 కరోనా కేసులు వెలుగుచూశాయి.

TS corona Cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63,120 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 3,308 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరోవైపు కరోనాతో మరో 21 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,51,035 కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,106 మంది మరణించారు. కొత్తగా 4,723 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,04,970కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,959 యాక్టివ్ కేసులున్నాయి. అటు అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 513 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story