Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 3,762 కరోనా కేసులు..!

Telangana Corona Cases :  తెలంగాణలో కొత్తగా 3,762 కరోనా కేసులు..!
Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 91,048 టెస్టులు చేయగా, 3762 కొత్త కేసులు బయటపడ్డాయి.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 91,048 టెస్టులు చేయగా, 3762 కొత్త కేసులు బయటపడ్డాయి. మరోవైపు కరోనాతో పోరాడుతూ 20 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,63,903 కి చేరింది. తాజాగా 3,816 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో 5,22,082 మంది కరోనా నుంచి బయటపడ్డారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,189 పెరిగింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 528 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story