TS Corona : తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు..

TS Corona : తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు..
TS corona : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది.

TS corona : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది.. నిన్న మూడున్నర వేల వరకు కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య 4వేలు దాటేంది.. 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 4,207 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.కరోనా కారణంగా ఒక్కరోజులో ఇద్దరు చనిపోయారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్‌ విడుదల చేసింది.. కరోనా నుంచి 1825 మంది కోలుకోగా, రివకరీ రేటు 95.75 శాతానికి చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 26వేలా 633 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇంకా 10వేల 136 శాంపిల్స్‌కు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది.

కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచి ఫీవర్‌ సర్వే నిర్వహించనుంది. కరోనాపై జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా ఇవాళ మంత్రులు హరీష్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమీక్షించారు. గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందువల్ల కట్టడి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని హరీష్‌రావు చెప్పారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. సేకండ్‌ వేవ్‌ కు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు రాలేదని, ప్రస్తుతం లక్షణాలు లేకున్నా పాజిటివ్‌ వస్తుండడంతో వారి నుంచి మిగతావారికి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువైందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story