తెలంగాణలో కోత్తగా 5,093 కేసులు, 15 మంది మృతి..!

తెలంగాణలో కోత్తగా 5,093 కేసులు, 15 మంది మృతి..!
రాష్ట్రంలో వైరస్ ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 743 కేసులు తేలాయి.

తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శనివారం ఒక్కరోజే 5వేల 093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 743 కేసులు తేలాయి. జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మేడ్చల్‌లో 488, రంగారెడ్డిలో 407, నిజామాబాద్‌లో 365, కామారెడ్డిలో 232, జగిత్యాలలో 223 కేసులు వచ్చాయి. అటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.

నిన్న కరోనాతో మరో 15 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3లక్షల 51వేల 424 కేసులు నమోదు కాగా.. కరోనాతో 1824 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 37వేల 37 యాక్టివ్ కేసులున్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. ప్రజలు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడకపోతే.. రానున్న రోజుల్లో మహమ్మారి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story