TS corona cases : తెలంగాణలో కొత్తగా 993 కేసులు, 9 మరణాలు

TS corona cases : తెలంగాణలో కొత్తగా 993 కేసులు, 9 మరణాలు
TS corona cases : తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

TS corona cases : తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న లక్షా 12 వేల 982 శాంపిల్స్‌ను పరిక్షించగా... కేవలం 993 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 124 మంది వైరస్‌ బారినపడ్డారు. ఒక్కరోజులోనే 9 మంది కరోనా కారణంగా మరణించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటివకు 6 లక్షల 21 వేల 606 కేసులు నమోదు కాగా... 3 వేల 644 మంది మృత్యువాత పడ్డారు. ఇక 24 గంటల్లోనే కరోనా నుంచి కోలుకుని 14 వందల 17 మంది రికవరీ అయ్యారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 13 వేల 869 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story