మృత్యువేదనలోనూ ముగ్గురికి అవయవ దానం!

మృత్యువేదనలోనూ ముగ్గురికి అవయవ దానం!
రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహిత వెల్లంకి విజయ(34) ఖమ్మంలో ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది.

మృత్యువేదనలోనూ ఓ ముగ్గురికి అవయవ దానం చేసి వారికీ కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఓ మహిళ.. ఇక వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహిత వెల్లంకి విజయ(34) ఖమ్మంలో ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త కృష్ణ మోహన్ కూడా ఓ ప్రైవేట్ జాబు చేస్తున్నాడు. ఈ దంపతులకి ధాన్వీ అనే ఓ కుమార్తె ఉంది. అయితే ఓ మూడు రోజుల క్రితం విజయకి తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

అక్కడ విజయ చికిత్స పొందుతుండగా మంగళవారం రాత్రి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. అయితే ఆమె భర్త కృష్ణ మోహన్ జీవన్‌దాన్‌ పథకంలో ఆమె అవయవాలను ముగ్గురికి దానం చేశాడు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలికకు గుండె, ఒక ఊపిరితిత్తిని అమర్చారు. ఇక మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు రెండు కిడ్నీలను, ఒక ఊపిరితిత్తిని దానం చేశారు. కృష్ణ మోహన్ చేసిన ఈ పనికి గాను బంధువులు, గ్రామస్థులు అభినందించారు.

కృష్ణ మోహన్ ఇంట్లో గత నాలుగు నెలల్లో రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. కృష్ణ మోహన్ తండ్రి మోహన్‌రావు ఇటీవలే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందాడు. ఆ విషాదం నుంచి తేరుకోక ముందే కృష్ణ మోహన్ భార్య విజయ కూడా మృతి చెందింది. దీనితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story