కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ.. భర్త వ్యాపారంలో 'పాలు' పంచుకుంటూ..

కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ.. భర్త వ్యాపారంలో పాలు పంచుకుంటూ..
వరంగల్‌ జిల్లా గాయత్రీనగర్‌కు చెందిన తోటకూర స్వప్న 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ప్రస్తుతం వరంగల్‌లోని మహిళా పోలీస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుంది.

మహిళలకి పురుషులకంటే చాలా విషయాల్లో సహనం ఎక్కువ.. అందుకే భూదేవికి ఉన్నంత సహనం స్త్రీకి ఉంటుందంటారు మన పెద్దవాళ్ళు... ఓ భార్యగా, గృహిణిగా, ఇల్లాలుగా, తల్లిగా తన జీవితంలో ఎన్నో రకాల పాత్రలు పోషిస్తుంది స్త్రీ.. కానీ ఎప్పుడు కూడా చిరాకును ఆమె మొఖంలో కనబడనివ్వదు.. ఏదైనా సరే చిరునవ్వుతోనే స్వీకరిస్తూ తన కుటుంబాన్నీ ముందుకు నడుపుతుంది. అలాంటి స్త్రీలలో ఒకరు ఈ తోటకూర స్వప్న..

వరంగల్‌ జిల్లా గాయత్రీనగర్‌కు చెందిన తోటకూర స్వప్న 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ప్రస్తుతం వరంగల్‌లోని మహిళా పోలీస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుంది. కానిస్టేబుల్‌గా వచ్చే జీతం సరిపోతుంది కదా ఇంకెందుకు కష్టపడడం అనుకోలేదు.. ఒంట్లో సత్తా... పోరాడే శక్తి ఉంటే ఇంకేమైనా చేయొచ్చు అనుకుంది. అందుకే భర్త చేసే పాల వ్యాపారంలో పాలు పంచుకుంది. తన భర్త విజయాన్ని మరింత ముందుండి నడిపిస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది.

ఎప్పుడు డ్యూటీకి వెళ్తామో.. ఎప్పుడు వస్తామో తెలియని శాఖలో పనిచేస్తున్న స్వప్న... ఖాళీ సమయం దొరికితే చాలు... తన భర్తకు చేదోడు వాదోడుగా పాల డెయిరీ నిర్వహణలో పాలు పంచుకుంటుంది. విధుల ముగించుకొని ఇంటికి వచ్చాక లేదా వెళ్లే ముందు తమ ఇంట్లో ఉండే పదిహేనుకు పైగా పాడిగేదెల సంరక్షణ చూసుకోవడం, మేత వేయడం, పాలు పితకడం ఇలా అన్ని పనులు చేస్తుంది.

అంతేకాకుండా పితికిన పాలను ప్యాకెట్ల రూపంలో నింపి తన భర్త సురేష్‌ ద్వారా ఇంటింటికి చేరవేస్తుంది. ఉద్యోగం, వ్యాపారమే కాదు కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తుంది. తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ ఆదర్శ మాతృమూర్తిగా నిలుస్తుంది కానిస్టేబుల్‌ స్వప్న.

Tags

Read MoreRead Less
Next Story