గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు షాక్‌

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు షాక్‌

కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి గుడ్‌బై చెప్పారు. మంగళవారం ఢిల్లీలో.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ తర్వాత GHMC ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచార బరిలోకి దిగనున్నారు. 2009లో టీఆర్‌ఎస్‌ తరపున మెదక్ నుంచి విజయశాంతి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత విభేదాలతో 2014లో కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. బీజేపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి.. ఇప్పుడు.. మళ్లీ అదే పార్టీలోకి చేరబోతున్నారు.

విజయశాంతి తన రాజకీయ జీవితాన్ని బీజేపీతోనే ప్రారంభించారు. భారతీయ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌తో విభేదాలు రావడంతో 2014లో కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కషాయ కండువ కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. విజయశాంతి స్టార్ ఇమేజ్ గ్రేటర్ ఎన్నికల్లో కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story