హ్యాట్సాఫ్.. ఆగిపోయిన గుండెకి మళ్ళీ ఊపిరి పోశారు..!

హ్యాట్సాఫ్.. ఆగిపోయిన గుండెకి మళ్ళీ ఊపిరి పోశారు..!
ఆ బాబు పుట్టి అప్పటికి మూడు రోజులైంది. అనారోగ్యంగా బాధపడుతుండడంతో కరీంనగర్ లోని సివిల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఆ బాబు పుట్టి అప్పటికి మూడు రోజులైంది. అనారోగ్యంగా బాధపడుతుండడంతో కరీంనగర్ లోని సివిల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనితో వైద్యులు వరంగల్ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాలని బాబు తల్లిదండ్రులకు సూచించారు. దీనితో ఆ బాలుడిని కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అయితే మార్గమధ్యంలో అ పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీనితో వెంటనే అలర్ట్ అయిన అంబులెన్స్‌ సిబ్బంది హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. అనంతరం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం ఈ బాలుడు జన్మించాడు.

Tags

Read MoreRead Less
Next Story