Raj Bhavan Bathukamma 2021 : హైదరాబాద్‌ రాజ్‌‌‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు...!

Raj Bhavan Bathukamma 2021 : హైదరాబాద్‌ రాజ్‌‌‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు...!
Raj Bhavan Bathukamma 2021 : బతుకమ్మ తెలంగాణ పండుగైనా.. గవర్నర్‌గా, తెలంగాణ ఆడపడుచుగా వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తమిళి సై పేర్కొన్నారు.

Raj Bhavan Bathukamma 2021 : హైదరాబాద్‌ రాజ్‌ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్, ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. రాజ్‌భవన్‌ మహిళ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ పండుగైనా.. గవర్నర్‌గా, తెలంగాణ ఆడపడుచుగా వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తమిళి సై పేర్కొన్నారు. ఇటీవల తన తల్లిని కోల్పోయానన్న గవర్నర్‌.. ఆమె కోరిక మేరకు అన్ని పండుగలూ ఘనంగా జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ.. బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని గవర్నర్‌ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story