అనేక అంశాలను వెలుగులోకి తెచ్చిన అఖిలప్రియ సోదరి భూమా మౌనిక

అనేక అంశాలను వెలుగులోకి తెచ్చిన అఖిలప్రియ సోదరి భూమా మౌనిక
తన సోదరి మాజీమంత్రి అఖిలప్రియకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు భూమా మౌనిక.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. రోజులు గుడుస్తున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త వాదనలు, కొత్త కేసులు అనూహ్యంగా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలప్రియ సోదరి భూమా మౌనిక అనేక అంశాలను వెలుగులోకి తెచ్చారు. తన సోదరి మాజీమంత్రి అఖిలప్రియకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలప్రియను జైల్లో ఉగ్రవాది కన్నా దారుణంగా చూస్తున్నారని, ఆమెకు వైద్యం అందించడం లేదని ఆరోపించారు. ఆస్పత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానం అదేనా? అని ప్రశ్నించారు. ఆమెను రహస్యంగా ఎందుకు తీసుకెళ్లారని నిలదీశారు.

భూవివాదంపై చర్చించడానికి తాము సిద్ధమని భూమా మౌనిక స్పష్టం చేశారు. ఈ భూవివాదం తమ తండ్రి బతికి ఉన్నప్పటి నుంచి ఉందన్నారు. అమ్మానాన్న ఆళ్లగడ్డకో.. కర్నూలుకో పరిమితమైన నేతలు కాదని తెలిపారు. అమ్మ శోభా నాగిరెడ్డి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పోలీసులే కేసును నిర్ధారిస్తే కోర్టులు ఎందుకని ప్రశ్నించారు మౌనికరెడ్డి. ఏ ఆధారాలతో అఖిలప్రియను అరెస్ట్‌ చేశారు? పోలీసులను ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్‌ను వేడుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story