తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. ఎమ్మెల్యే షకీల్‌కు పాజిటివ్

తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. ఎమ్మెల్యే షకీల్‌కు పాజిటివ్

coronavirus(File Photo) 

బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే తండ్రికి పాజిటివ్ వచ్చింది.

తెలంగాణలో కరోనా మహహ్మరి కోరలు చాస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వెయ్యికు చేరువుగా కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 965 కేసులు నమోదుకాగా.. ఐదుగురు మృతిచెందారు. ఒక్క గ్రేటర్ పరిధిలోనే 254 కేసులు నమోదుకావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లాలో 110, రంగారెడ్డి జిల్లాలో 97, నిర్మల్ జిల్లాలో 39, జగిత్యాల జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసులు సంఖ్య 3 లక్షల 9వేల 741కు చేరుకోగా.. మరణాల సంఖ్య 1706కి చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 6,159 ఉండగా.. 3లక్షల వేయి మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కరోజే 179 కేసులు నమోదయ్యాయి. ఇందులో నిజామాబాద్ లో 86, కామారెడ్డిలో 93 కేసులు వచ్చాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్ లో 46 కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న వారిలోనే కేసులు భారీగా బయటపడుతున్నాయి. ఇక జిల్లాలోని బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే తండ్రికి పాజిటివ్ వచ్చింది.


Tags

Read MoreRead Less
Next Story