Bride Jump : గంటలో పెళ్లి.. కట్నం డబ్బుతో వరుడు జంప్..!

Bride Jump : గంటలో పెళ్లి.. కట్నం డబ్బుతో వరుడు జంప్..!
Bride Jump : ఉంగరాలు పెట్టాడు. పట్టుబట్టలు కట్టాడు. ఫొటోలకు ఫోజులూ ఇచ్చాడు.

Medak: రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా వరుడు అదృశ్యమైన ఘటన SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయిగూడెంకు చెందిన సత్యనారాయణ అలియాస్‌ నాని కనిపించకుండాపోయాడు. ఈ నెల 17న పెళ్లి జరగాల్సి ఉంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పని చేస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన KPHB కాలనీలో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. తర్వాత ఆచూకీ లేకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెళ్లికి సై అన్నాడు. సకుటుంబ సపరివారంతో మంటపానికి వచ్చాడు. ఉంగరాలు పెట్టాడు. పట్టుబట్టలు కట్టాడు. ఫొటోలకు ఫోజులూ ఇచ్చాడు. మరో గంటాగితే పెళ్లి. ఇంతలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడా కంత్రీ. అమ్మాయి తరపువాళ్లు ఇచ్చిన నగలు, నగదు గట్రా పట్టుకుని దర్జాగా జంపైపోయాడు. పీటల వరకూ వచ్చిన పెళ్లిని వదిలేసి.. 25 లక్షల డబ్బు, 25 తులాల బంగారంతో పరారవడంతో ఆడపెళ్లివాళ్లు షాక్‌కి గురయ్యారు. పోలీస్ స్టేషన్‌కెళ్లి కేసు పెట్టారు.

పెళ్లికి గంట ముందు వరుడు పరార్‌ అయిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలంలో జరిగింది. చిమ్నాపూర్‌కు చెందిన యువతిని కొండాపూర్‌కు చెందిన మాణిక్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఆగస్టు 27న నిశ్చితార్థం జరిపించారు. 25 లక్షల నగదు.. అలాగే 25 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఈ నెల 12న పెళ్లికి ముహూర్తం పెట్టారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలోని కల్యాణమండపంలో అన్ని ఏర్పాట్లూ చేశారు. తీరా వివాహానికి గంట ముందు కట్నం డబ్బులు, బంగారంతో పెళ్లి కొడుకు పారిపోయాడు. తర్వాత మాణిక్‌ రెడ్డి కుటుంబసభ్యులు కూడా ఊరు విడిచి వెళ్లిపోయారు. ఊహించని ఈ ఘటనతో అమ్మాయి కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జరిగిన వంచన నుంచి కాస్త తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉన్నట్టుండి వరుడు ఎందుకు హ్యాండిచ్చాడు. పాతిక లక్షల డబ్బు, బంగారంతో ఎందుకు పారిపోయాడు. ఇప్పటికైతే అంతా మిస్టరీగానే ఉంది. ఆ నయవంచకుడు ఎందుకు ఇలా చేశాడో తెలియక ఆ అమ్మాయి షాక్‌లోనే ఉంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన వేళ.. ఇంతలా మోసపోవడం తట్టుకోలేకపోతున్నారు అమ్మాయి తరపువాళ్లు. ఈ కన్నింగ్‌ ఫ్యామిలీని పట్టుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story