సూర్యాపేటలో ఘరానా మోసం.. పాస్టర్‌ను నమ్మి మోసపోయి లబోదిబోమంటున్న జనం

సూర్యాపేటలో ఘరానా మోసం.. పాస్టర్‌ను నమ్మి మోసపోయి లబోదిబోమంటున్న జనం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘరానా మోసం వెలుగుచూసింది. పట్టణంలోని కుడకుడ ప్రాంతానికి చెందిన పాస్టర్ జాన్‌.. లాక్‌డౌన్ టైమ్‌లో సేవా కార్యక్రమాలు చేస్తూ పాపులర్ అయ్యాడు. పలువురు ఉన్నతాధికారుల్ని తన కార్యక్రమాలకు పిలిపించి.. తనకు పెద్దవాళ్లతో పరిచయాలున్నాయని జనాన్ని నమ్మించాడు. వారితో దిగిన ఫోటోలు చూపిస్తూ.. బ్యాంకు లోన్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని స్థానికులకు హామీ ఇచ్చాడు. పాస్టర్ జాన్‌ను నమ్మిన స్థానికులు పెద్ద మొత్తాల్లో డబ్బులు సమర్పించుకున్నారు.

నెలలు గడుస్తున్నా.. పనులు జరగక్కపోవడంతో పాస్టర్ జాన్‌ను జనం గట్టిగా నిలదీశారు. రెండు రోజుల్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తానని.. విడివిడిగా అందరికీ హామీ ఇచ్చాడు జాన్‌. ఆ తర్వాత బాధితులంతా.. పాస్టర్‌ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటంతో షాక్ అయ్యారు. తామంతా మోసపోయామని గ్రహించిన బాధితులు.. లబోదిబోమంటున్నారు. డబ్బు వసూలు చేసి రాత్రికిరాత్రే జెండా ఎత్తేశాడని.. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story