CM KCR Review : పల్లె , పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం కేసీఆర్‌ రివ్యూ..!

CM KCR Review : పల్లె , పట్టణ ప్రగతిపై అధికారులతో  సీఎం కేసీఆర్‌ రివ్యూ..!
CM KCR Review : తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె , పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం కేసీఆర్‌ రివ్యూ చేస్తున్నారు.

CM KCR Review : తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె , పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం కేసీఆర్‌ రివ్యూ చేస్తున్నారు. గ్రామాలు , పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రగతిభవన్‌లో చర్చిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రతే ప్రధాన ఎజెండాగా చర్చ జరుగుతుంది. కనీస వసతుల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దిశానిర్ధశం చేయనున్నారు. హరి‌త‌హా‌రం విజయవంతానికి తీసు‌కో‌వా‌ల్సిన చర్యలను సైతం సమావేశంలో సీఎం చర్చిస్తున్నారు.

ఈ దఫా హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో తీసుకోవల్సిన చర్యలను గురించి భేటిలో చర్చించనున్నారు. జూలై ఒకటి నుంచి పది వరకు రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటిల్లో పల్లె,పట్ణణ ప్రగతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో పాలనాపరమైన అంశాలపై కలెక్టర్లకు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.

సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story