KCR letter to Modi: ప్రధాని మోడీకి లేఖ రాయనున్న సీఎం కేసీఆర్..

KCR letter to Modi: ప్రధాని మోడీకి లేఖ రాయనున్న సీఎం కేసీఆర్..
KCR letter to Modi: ఆదాయం రెట్టింపు కాకపోగా....ఉల్టా ఖర్చులు రెట్టింపు చేస్తున్నారని మండిపాటు

KCR letter to Modi: కాసేపట్లో ప్రధాని మోడీకి లేఖ రాయనున్నారు సీఎం కేసీఆర్. ఎరువుల ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ....ఉల్టా రైతులపై ఖర్చులు మోపుతోందని మండిపడ్డారు.

ఈ నిర్ణయంతో బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని నిర్ధరణ అయిందన్నారు. బోరుబావులకు కరెంటు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడం దారుణమన్నారు కేసీఆర్. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించే నిర్ణయంపైనా నాన్చుడు ధోరణిని తప్పు పట్టారు.

ఎరువుల ధరలు పెంచడం సహా పండించిన ధాన్యాన్ని కొనకుండా ఉండడం వెనుక కుట్ర దాగుందన్నారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. ఎరువుల ధరలు తగ్గించకుంటే రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఆందోళనలు తప్పవన్నారు.

దశాబ్ధాలుగా ఎరువుల ధరలపై కొనసాగుతున్న సబ్సిడీని ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నించారు. దేశ రైతంగం నాగండ్లు ఎత్తి తిరగబడాల్సిన సమయం వచ్చిందన్నారు.


Tags

Read MoreRead Less
Next Story