వచ్చే 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం-సీఎం కేసీఆర్‌

వచ్చే 20 ఏళ్లు  టీఆర్ఎస్‌దే అధికారం-సీఎం కేసీఆర్‌
KCR: అన్ని వర్గాల కంటే దళితులు వెనుకబడ్డారు కాబట్టే మొదట వారి కోసం దళిబంధు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పారు.

KCR: అన్ని వర్గాల కంటే దళితులు వెనుకబడ్డారు కాబట్టే మొదట వారి కోసం దళిబంధు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పారు.. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. దళిత బంధుపై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీవీ ఛానెళ్ల డిబేట్లలో ప్రతిపక్షాల తప్పుడు విమర్శలకు దీటుగా జవాబివ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు.. దళితబంధును ఉద్యమంలా చేయాలని, ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు. వచ్చే 20 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని.. బీసీ బంధుతో సహా అన్నీ మనమే ఇస్తామని కేసీఆర్‌ చెప్పారు.. దశల వారీగా అన్ని వర్గాలకు బంధు ఇస్తామన్నారు.

ఇక వచ్చేనెల 2న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. అధినేత కేసీఆర్‌ చేతుల మీదుగా భూమిపూజ జరుగుతుందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.. కొత్తగా జిల్లాలకు అధ్యక్షులను నియమించనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు.. ఈనెలాఖరు వరకు మెంబర్‌షిప్‌ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. సెప్టెంబరు మొదటి వారంలో గ్రామ కమిటీలు, రెండో వారంలో మండల కమిటీలు, మూడో వారంలో జిల్లా కమిటీల నియామకం జరుగుతుందన్నారు కేసీఆర్‌. అక్టోబరులో రాష్ట్ర కమిటీలు పూర్తిచేసుకోవాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story