కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన దాసోజు శ్రావణ్.. లెక్కలు తప్పని నిరూపించేందుకు సిద్దం... !

కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన దాసోజు శ్రావణ్.. లెక్కలు తప్పని నిరూపించేందుకు సిద్దం... !
లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. తప్పని నిరూపిస్తే చర్చకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ స్వీకరించారు.

ఉద్యోగాల భర్తీ అంశం పై తెలంగాణ పాలిటిక్ హీటెక్కాయి. లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. తప్పని నిరూపిస్తే చర్చకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ స్వీకరించారు. లెక్కలు తప్పని నిరూపించేందుకు తాను సిద్ధమని.. గన్ పార్క్ వద్దకు చర్చకు రావాలని శ్రావణ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులను వెంటబెట్టుకొని గన్ పార్క్‌ వద్దకు దాసోజు శ్రావణ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇక ఉద్యోగ నియామకాలపై చర్చకు రావాలని కోరినా.. ఇప్పటివరకు కేటీఆర్ రాలేదని దాసోజు శ్రావణ్ అన్నారు. ఏ ఆకాంక్షతో తెలంగాణ సాధించుకున్నామో.. అది నెరవేరలేదని ఆయన తెలిపారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. కాంగ్రెస్ హయాంలో 10వేల ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదని చెప్పడం సిగ్గు చేటంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story