మరో వికెట్ కోల్పోనున్న టీ కాంగ్రెస్?

మరో వికెట్ కోల్పోనున్న టీ కాంగ్రెస్?

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ కాంగ్రెస్ ను వీడుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మీడియాలో వస్తున్న దీనిపై విజయశాంతి స్పందించకపోవడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాములమ్మ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేదే విజయశాంతి ప్రధాన ఆరోపణగా ఉంది. తనను కనీసం కోర్ కమిటీ సమావేశానికి కూడా పిలవకపోవడం పై ఆమె గుర్రు గా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే గాంధీ భవన్ కార్యదర్శి ద్వారా సమాచారం ఇస్తున్నప్పటికీ ఆమె హాజరు కావడంలేదు. అయితే ఆమెను శాంతింప చేసేందుకు పిసిసి చీఫ్ ఉత్తమ్ అప్పట్లో కుంటియాతో కలిసి ఆమె ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపారు .. కానీ పలితం లేదు.

రాష్ట్రంలో ఏవైనా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్షిస్తూ ప్రకటనలు విడుదల చెయ్యడం తప్ప ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాములమ్మ. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులపై అసంతృప్తితో ఉన్న విజయశాంతి పార్టీ మార్పు పై ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఆమె బిజెపి జాతీయ నాయకులకు టచ్లో వెళ్లినట్టు సమాచారం. ఈ విషయాలన్నీ కాంగ్రెస్ ముఖ్య నేతలకు తెలుస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతి ఇంటికి వెళ్లి మంతనాలు జరపడంతో కాంగ్రెస్ పార్టీ లో కలకలం మొదలైంది. ఈ తాజా పరిణామాలతో పార్టీ నుంచి విజయశాంతి వెళ్లిపోయే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతిని కలవడం రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నారు రాములమ్మ సన్నిహితులు. కిషన్ రెడ్డి కేవలం మర్యాదపూర్వకంగానే ఆమెను కలిశారని వారు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story