Budget 2021 : ఇది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బడ్జెట్‌: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Budget 2021 : ఇది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బడ్జెట్‌: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ ‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు.

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ ‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. 29 రాష్ట్రాలకు న్యాయం చేసేలా లేదన్నారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇవ్వడం దుర్మార్గమన్నారు. తెలంగాణకు బీజేపీ వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పడానికి ఈ బడ్జెటే నిదర్శనమన్నారు ఉత్తమ్‌.

అటు బడ్జెట్‌పై పలు విమర్శలు చేశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా. ఆత్మనిర్భర్‌ గురించి మాట్లాడిన ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్.. ఆహార భద్రత గురించి ఎందుకు మాట్లాడటేదని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో కేంద్రం పబ్లిక్ సెక్టార్లను తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. ఎల్‌ ఐసీ, కోల్ రంగాన్ని ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. ఈ బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలమని, అంతర్జాతీయ పెట్టుబడులకు దారులు వేస్తుందన్నారు. పేదల వ్యతిరేక బడ్జెట్ అన్న రాజా.. ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ఏం చేసిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story