తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. మూడు రోజులు స్కూల్‌కు సెలవులు

తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. మూడు రోజులు స్కూల్‌కు సెలవులు
కరోనా కలకలంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.. దీంతో మూడురోజులపాటు స్కూల్‌కు సెలవు ప్రకటించారు అధికారులు.

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. కొద్దిరోజులుగా చాపకింద నీరులా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది.. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్‌లో వైరస్‌ కలకలం రేపుతోంది.. రెండ్రోజుల్లో 52 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. బాధితుల్లో 30 మంది బాలికలు, 14 మంది టీచర్లు, ఆరుగురు పేరెంట్స్‌, ఇద్దరు వంటవారు ఉన్నారు.. దీంతో పరీక్షల సంఖ్య పెంచారు అధికారులు. 200 మంది విద్యార్థినులకు టెస్టులు కొనసాగుతున్నాయి.. కరోనా కలకలంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.. దీంతో మూడురోజులపాటు స్కూల్‌కు సెలవు ప్రకటించారు అధికారులు.

కామారెడ్డి జిల్లాలోనూ కరోనా బాధితులు పెరిగిపోతున్నారు.. జిల్లాలో ఒక్కరోజే 46 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. దీంతో బాధితుల సంఖ్య 13వేలా 758కి చేరింది.. ఇక హైదరాబాద్‌లోనూ కరోనా బాధితులు పెరుగుతున్నారు.. నాగోల్‌లోని మైనార్టీ బాలికల హాస్టల్‌లో 36 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.. 184 మందికి పరీక్షలు చేయగా.. 36 మందికి పాజిటివ్‌గా తేలింది.. వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. మిగిలిన వారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు.. మరోవైపు కరోనా భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్‌ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story