తెలంగాణలో 600 మంది ఎస్‌బీఐ ఉద్యోగులకు కరోనా..!

తెలంగాణలో 600 మంది ఎస్‌బీఐ ఉద్యోగులకు కరోనా..!
తెలంగాణలో కరోనా సెకెండ్‌ వేవ్‌లో 600 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటించారు.

తెలంగాణలో కరోనా సెకెండ్‌ వేవ్‌లో 600 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటించారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్‌ బారిన పడుతున్నారన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవాల్టి నుంచి ఏప్రిల్‌ 30 వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని‌ కోఠి , సికింద్రాబాద్‌ ఎస్బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఓపీ మిశ్రా తెలిపారు.

మొత్తం 12 వేల 500 మంది ఉద్యోగుల్లో మొదటి దశలో 2 వేల 200 మంది, రెండో దశలో ఇప్పటివరకు 600 మంది కరోనా బారిన పడినట్లు తెలిపారు. దాదాపు వంద బ్యాంకు శాఖల ఉద్యోగులు ఎక్కువ మంది కరోనా బారిన పడటం వల్ల.. ఈ బ్రాంచీలను రెండు మూడ్రోజుల పాటు మూసివేసి తిరిగి తెరిచామన్నారు. వీలైనంత వరకు ఖాతాదారులు.. డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story