తెలంగాణలో రెండో రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో రెండో రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం
తెలంగాణలో ఏకంగా 200 కేంద్రాలను అదనంగా పెంచారు.

తెలంగాణలో రెండో రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 324 సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ప్రతి సెంటర్‌లో 50 మందికి టీకా ఇస్తారు. శనివారం నాడు 140 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని ప్రభుత్వం తెలిపింది. కాకపోతే, కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో చాలా సమస్యలు ఎదురైనట్టు ప్రభుత్వం గుర్తించింది. తొలిరోజు టీకా తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండడానికి కొవిన్‌ యాప్‌లో లోపాలే కారణమని ప్రభుత్వం కూడా అంగీకరించింది.

ఇతర వైద్య సేవలు, టీకా కార్యక్రమాలకు విఘాతం కలగకుండా వారానికి నాలుగు రోజులు మాత్రమే కరోనా టీకా కార్యక్రమం చేపట్టనున్నారు. మొదటి రోజు వ్యాక్సినేషన్‌లో దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే టీకాలు వేశారని కేంద్రం ప్రకటించింది.

వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో భరోసా పెరుగుతుండడంతో.. వ్యాక్సినేషన్‌ కేంద్రాలు, టీకాల సంఖ్యను పెంచుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణలోనూ ఏకంగా 200 కేంద్రాలను అదనంగా పెంచారు. తెలంగాణలో వారానికి నాలుగు రోజులు మాత్రమే టీకా వేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వారానికి ఆరు రోజులపాటు టీకా కార్యక్రమం జరగనుంది.


Tags

Read MoreRead Less
Next Story