భారత్ బయోటెక్ లో కరోనా వ్యాక్సిన్ పనితీరు పరిశీలిస్తోన్న విదేశీ ప్రతినిధుల బృందం

భారత్ బయోటెక్ లో కరోనా వ్యాక్సిన్ పనితీరు పరిశీలిస్తోన్న విదేశీ ప్రతినిధుల బృందం

కరోనా వ్యాక్సిన్ తీరు పరిశీలనకు హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీకి వెళ్లిన విదేశీ ప్రతినిధుల బృందం బిజీ బిజీగా గడుపుతోంది. 64దేశాల ప్రతినిధులు రెండు బృందాలుగా విడిపోయారు. వీరిలో ఒక బృందం భారత్ బయోటెక్ లో కరోనా వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తుండగా.. మరో బృందం 'బయెలాజికల్-ఈ'ను మరో బృందం సందర్శిస్తోంది. అటు.. కరోనా వ్యాక్సిన్ పనితీరుపై భారత్ బయోడటెక్‌ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది.

విదేశీ ప్రతినిధులకు కరోనా వ్యాక్సిన్ తయారీపై భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్ ద్వారా కోవాగ్జాన్ వివరాలను రాయబారులకు ఆయన వెల్లడించారు .పది రోజుల క్రితం ప్రధాని మోదీ కూడా భారత్ బయోటెక్ సందర్శించి కోవాగ్జిన్ పనితీరును తెలుసుకున్నారని వివరించారు. టీకా రంగంలో భారత్ బయోటెక్ ఎన్నో ప్రయోగాలు చేస్తోందని కృష్ణ ఎల్లా వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌.. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులపై నిపుణుల బృందం కాసేపట్లో సమావేశం కానుంది. ఈ మూడింటిలో ఒకటి లేదా రెండింటికి త్వరగా అనుమతి లభిస్తుందని భావిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నిపుణుల బృందం నివేదిక అందించిన రెండు వారాల్లోగా కరోనా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story