Telugu states : తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కొత్త వేరియంట్లు

Telugu states :  తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కొత్త వేరియంట్లు
Telugu states : తెలుగు రాష్ట్రాల్లో కరోనా , ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది.

Telugu states : తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 19 వందల 13 మంది కరోనా బారిన పడ్డారు. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు చనిపోయారు. తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేల 847కు పెరిగింది.

మరో 15 రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజీకి చేరే ప్రమాదం పొంచి ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారానికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిపోయిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

ఇటు ఏపీలోనూ కొవిడ్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 33 వేల 339 శాంపిల్స్‌ను పరీక్షించగా 547 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తాజాగా చిత్తూరులో 96, విశాఖలో 89, కృష్ణాలో 66, గుంటూరులో 49, తూర్పుగోదావరిలో 43, పశ్చిమ గోదావరిలో 43, నెల్లూరులో 42 కేసులు బయటపడ్డాయి.

ఇక 24 గంటల్లో 128 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల 266 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో విశాఖపట్నంలో మరొకరు చనిపోవడంతో మొత్తం... ఇప్పటివరకు మరణాల సంఖ్య 14 వేల 500కి పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story