అన్ని జిల్లాల్లో ఆ పార్టీదే హవా.. బ్యాలెట్‌ బాక్సులో కేసీఆర్‌కు రాసిన లేఖ

ZPTC, MPTC ఎన్నికల కౌంటింగ్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తోంది. మరికొన్ని చోట్ల బీజేపీ పోటీనిస్తోంది. బోధన్ మండలం సాలూరా ఎంపీటీసీని 3 ఓట్లతో టీఆర్‌ఎస్ గెలిచింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కి 70, కాంగ్రెస్‌కు 25 ఎంపీటీసీలు వచ్చాయి. ఇదే జిల్లాలో 10కిపైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిమ్మాపురంలో 803 ఓట్లు కాంగ్రెస్ గెలిచింది. మహబూబాబాద్ మండలం నడవాడ టీఆర్ఎస్ ఎంపిటీసీ శ్రీపాల్ రెడ్డి 73 ఓట్ల విజయం సాధించారు. మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి శివారు సిత్ల తండాలో ఒక్క ఓటుతో

కాంగ్రెసు గెలిచింది. దీంతో రీకౌంటింగ్ చేయాలని ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట MPTC స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. చెన్నారావుపేట్ మండలం బొజేరువు MPTC స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గూడూరు మండలం దామెరవంచ గ్రామంలో 150 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి స్వాతి విజయం సాధించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం MPTC స్థానంలో 163 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంబోతు రవీందర్ గెలిచారు. మేడ్చల్ జిల్లా డబిల్ పూర్ లో కాంగ్రెస్ MPTC అభ్యర్థి హేమలత గెలుపొందారు. సూర్యపేట మండలం పిన్నాయి పాలెంలో TRS MPTC అభ్యర్థి పుప్పల లక్ష్మమ్మ 196 ఓట్లతో గెలిచారు. కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో కాంగ్రెస్ విజయం సాధించింది.

నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ MPTC స్థానంలో బీజేపీ 70 ఓట్లు విజయం సాధించింది. నిజామాబాద్ జిల్లామోపాల్ మండలంలో 11 MPTC ల్లో 7 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వరంగల్ అర్బన్ లో చెన్నారం TRS అభ్యర్థి అన్నమానేని అప్పారావు 1404 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కొమరం భీం జిల్లా గుర్రాల తండా MPTCగా స్వతంత్ర అభ్యర్థి మహేందర్ సింగ్ … TRS అభ్యర్థిపై విజయం సాధించారు. నిజామాబాద్ రూరల్ మండలంలో 3 MPTC స్థానాల్లో TRS గెలుపొందింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో బోయినిపల్లి మండలం కోదురుపాకలో TRSకు చుక్కెదురైంది. సీఎం కేసీఆర్ అత్తగారి ఉళ్లో MPTC కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలాగౌని గౌతమి విజయం సాధించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా ఇక్కడివారే. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో TRS అభ్యర్థులు సంబ లచ్చయ్య, కోరం మమత గెలుపొందారు. స్తంభంపల్లి బాబు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో CPM MPTC గెలిచారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్ MPTC బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. వరంగల్‌ జిల్లా చెన్నారంలో TRS అభ్యర్థికి 1404 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. నిజాంసాగర్ మండలం సింగీతంలో కాంగ్రెస్ MPTC 161 ఓట్లతో గెలిచారు. నాగిరెడ్డిపేట్ మండలం పోచారం, మాల్ తుమ్మెద MPTC స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. 2 చోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టగా మరో 2 చోట్ల ఓట్లు తడిచాయి. ఆ నాలుగు చోట్ల ఫలితాల ప్రకటనపై ఈసీ నిర్ణయమే ఫైనల్. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లో 2 బ్యాలెట్ బాక్సులు తడిచాయి. కొమురంభీం జిల్లా కౌటాల మండలం గురుడుపేట MPTC పరిధిలోని.. తలోడి గ్రామంలో బ్యాలెట్ పేపర్స్‌కు చెదలు పట్టింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబటిపల్లి సూరారంలో ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్లకు చెదలు పట్టడంతో గందరగోళం నెలకొంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం బ్యాలెట్‌ బాక్సులో సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ లభించింది. తమ గ్రామాన్ని మండలంగా మార్చాలని కోరుతూ… గర్రెపల్లి గ్రామస్థులు లేఖ రాసి బ్యాలెట్ బాక్స్ లో వేశారు. లెక్కింపు సమయంలో ఆ లేఖ బయటపడింది.

Tags

Read MoreRead Less
Next Story