తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్‌ మోగిస్తున్న కరోనా వైరస్

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్‌ మోగిస్తున్న కరోనా వైరస్
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలుగురాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొద్దిరోజులుగా క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అటు పాఠశాల విద్యార్థులను కరోనా భూతం వెంటాడుతూనే ఉంది. విజయనగరం జిల్లా నిడగల్లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. మొత్తం 28 మందికి పరీక్షలు నిర్వహించగా... ఏడుగురికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. మిగతా వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. వ్యాధి బారిన పడ్డవారంతా 5 వ తరగతి లోపువారే కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలంగాణలో కోవిడ్ వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు అన్ని కాలేజీలను హెచ్చరించింది. తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగుతుండటంతో అన్ని యూనివర్శిటీల పరిధిలోని ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story