దళితబంధు నూటికి నూరుశాతం సబ్సిడీ పథకం.. : సీఎం కేసీఆర్‌

దళితబంధు నూటికి నూరుశాతం సబ్సిడీ పథకం.. : సీఎం కేసీఆర్‌
తెలంగాణ దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లిలో ఏర్పాటు చేసిన సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

తెలంగాణ దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లిలో ఏర్పాటు చేసిన సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్‌... దళిత బంధు నూటికి నూరుశాతం సబ్సిడీ పథకం అని స్పష్టంచేశారు. 25ఏళ్ల క్రితమే దళిత బంధు పథకం ఆలోచన ఉందని చెప్పారు. గతేడాది ప్రారంభం కావాల్సిన పథకం... కరోనా కారణంగా ఏడాది ఆలస్యమైందని కేసీఆర్‌ తెలిపారు.

దళిత బంధు పథకంలో కిస్తీలు కట్టే కిరికిరి లేదని కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబాలకు కూడా దళిత బంధు అమలు చేస్తామని వివరించారు. తెలంగాణలో 17లక్షలకు పైగా దళిత కుటుంబాలు ఉన్నాయని... దళిత బంధు కోసం మొత్తం 22వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. దళిత బంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లో అందరికీ దళిత బంధు అమలు చేస్తామని అన్నారు. Byte

గతంలో దళితుల్ని పట్టించుకోని పార్టీలు ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నాయని కేసీఆర్‌ మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాలకు అపోహలు కలగడం పరిపాటిగా మారిందని విమర్శించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌పైనా విమర్శలు చేశారని మండిపడ్డారు. 75ఏళ్ల క్రితమే దళిత బంధు వంటి పథకం అమలు చేసి ఉంటే... ఇప్పుడు దళితుల పరిస్థితి ఇలా ఉండేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సాధించినట్టుగానే... దళిత బంధు పథకం కూడా విజయవంతంగా అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

రైతు బందు పథకం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. దళిత బంధు... జీవితంలో మరుపురాని పథకం అని అన్నారు. దళిత బంధు అద్భుతమైన పథకంగా నిలవాలని, లబ్ధిదారులు వివిధ రంగాల్లో విజయాలు సాధించాలని సూచించారు. దేశంలో చాలా మంది దళితులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని.. వారందరికీ విముక్తి కలగాలి అని ఆకాంక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story