కాబోయే సీఎం కేటీఆర్ కి కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీక‌ర్‌ ప‌ద్మారావు

కాబోయే సీఎం కేటీఆర్ కి కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీక‌ర్‌ ప‌ద్మారావు
అతి త్వరలో కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు. శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున శుభాకాంక్షలు చెబుతున్నా. కేటీఆర్‌ సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులను కాపాడాలని ఆకాంక్షిస్తున్నాను

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ త్వరలో సీఎం అవుతారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ త్వరలో సీఎం అవుతారని, తద్వారా తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మాట్లాడారు. తాజాగా తెలంగాణ శాస‌న‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు. శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున శుభాకాంక్షలు చెబుతున్నా. కేటీఆర్‌ సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులను కాపాడాలని ఆకాంక్షిస్తున్నా" అని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజ‌న‌ల్ కార్యాల‌య ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప‌ద్మారావు గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి కేటీఆర్ సభలో ఉండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story