విధి ఆడిన నాటకం.. సాయంత్రం కుమార్తె పెళ్లి.. ఉదయం తండ్రి మృతి

విధి ఆడిన నాటకం.. సాయంత్రం కుమార్తె పెళ్లి.. ఉదయం తండ్రి మృతి
Father Passed Away: కుమార్తె వివాహాన్ని వైభవంగా జరిపించాలని ఓ తండ్రి భావించాడు.

Father Passed Away: కుమార్తె వివాహాన్ని వైభవంగా జరిపించాలని ఓ తండ్రి భావించాడు. అనుకున్నట్లుగానే ఏర్పాట్లు పూర్తి చేశాడు. బంధువులందరికీ శుభలేఖలు పంచాడు. సాయంత్రం పెళ్లనగా.. ఉదయం తనువుచాలించాడు. ఈ అరుదైన ఘటన నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌లో చోటు చేసుకుంది. బీర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన షేక్‌ గూడ్‌సాబ్‌ (48) అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

షేక్‌ గూడ్‌సాబ్‌ బ్రతుకుదెరుకు కోసందుబాయి వెళ్లారు. కొంతకాలం తర్వాత స్వగ్రామానికి కిరాణ షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మూడో కుమార్తె తబషంకు సోమవారం పెళ్లి చేయాలని కొద్ది రోజుల కిందటే నిశ్చయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అకస్మాత్తుగా గూడ్‌సాబ్‌ అనారోగ్యం పాలుకావడంతో నిజామాబాద్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఈ ఉదయం మృతిచెందాడు. దీంతో పెళ్లి సజావుగా సాగిపోతుందని భావించి వచ్చిన బంధువులు మధ్యాహ్నం మృతుడి అంత్యక్రియలు పూర్తి చేశారు.

అనంతరం పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తదితర కారణాలతో సాయంత్రం గూడ్ సాబ్ మూడో కుమార్తె వివాహాం జరిపించారు. మరోవైపు షేక్ గూడ్ సామ్ చిన్న కుమారుడు దుబాయిలోనే ఉండడంతో తండ్రి చివరి చూపుకు నోచుకోలేదు. గూడ్ సాబ్ కూతురు తండ్రిలేరనే బాధను పంటి బిగువున దాచుకొని పెళ్ళి చేసుకుంది.


Tags

Read MoreRead Less
Next Story