అపార్ట్ మెంట్ సెల్లార్లో వరద నీరు .. అలాగే వదిలేస్తే..

అపార్ట్ మెంట్ సెల్లార్లో వరద నీరు .. అలాగే వదిలేస్తే..
ఎక్కువ రోజులైతే ముప్పు తప్పదని ఇంజినీర్లు

అకాల వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. అపార్ట్ మెంట్ సెల్లార్లలోకి నీరు చేరి ఎటూ పోయే దారి లేక అలాగే నిలిచి పోయాయి. కొందరు ఆ నీటిని మోటార్ల ద్వారా తోడేస్తున్నారు. మరి కొందరు అలాగే వదిలేస్తున్నారు. వరద నీటి ప్రవాహానికి కొన్ని చోట్ల ప్రహరీ గోడలు నేలమట్టం అయ్యాయి. మరి కొన్ని ప్రమాదం పొంచి ఉంది. సెల్లార్లలోనించి నీటిని తోడేయకపోతే కొద్దిరోజులు అయితే ప్రమాదం లేకపోయినా ఎక్కువ రోజులైతే ముప్పు తప్పదని ఇంజినీర్లు అంటున్నారు.

విదేశాల్లో ప్రతి భవనం సెల్లార్లో నీటిని తోడే మోటార్లు తప్పనిసరిగా ఉంటాయి. నీరు చేరిన వెంటనే వాటిని బయటకు తోడేస్తుంటారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారు కచ్చితంగా మోటార్లు ఏర్పాటు చేసుకోవాలి. కాంక్రీట్ గోడలతో ప్రమాదం లేనప్పటికీ ఇటుకలు, రాళ్లతో కట్టిన భవనాలకు ఇబ్బంది. నీరు ఎక్కువ రోజులు సెల్లార్ లో నిల్వ ఉంటే గోడలకు తేమ పట్టి ఫంగస్ వస్తుంది. దీంతో భవనంలో నివసిస్తున్న వారికి అనారోగ్యం చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఎర్తింగ్ సరిగా లేకపోతే విద్యుద్ఘాతాలు జరిగే ప్రమాదం ఉంది.

నాలాల పక్కన, చెరువుల్లో మునిగిన ఇళ్ల పునాదులకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. వీటికి దగ్గరగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంబయి, విశాఖ వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ముప్పు తక్కువే అయినా మురుగు, వరద నీరు సెల్లార్ లోకి చేరకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఇందుకు జాగింగ్ కాన్సెప్ట్ సరిగ్గా సరిపోతుంది. ఈ విధానంలో వరద నీరు భూమిలోకి ఇంకిపోయేందుకు పైపులు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం కొద్ది స్థలం కేటాయిస్తే సరిపోతుంది అని ప్రముఖ యూనివర్శిటీ ప్రొఫెసర్లు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story