మూడోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల..

మూడోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల..
పదవీ కాలం ఉండగానే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడం ఇది మూడోసారి.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి మూడోసారి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పాటు చేసిన తరువాత ఏడేళ్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ నిలిచారు. పదవీ కాలం ఉండగానే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడం ఇది మూడోసారి.

టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన తరువాత ఏడాదికి ఆ పార్టీలో చేరి ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తూ పార్టీ అధినేత కేసిఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఈటల ఎదిగారు. హైదరాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో ఉద్యమాల్లో పనిచేస్తున్న ఆయనను స్వంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వెళ్లి పార్టీ బాధ్యతలను చేపట్టవలసిందిగా కేసీఆర్ ఈటలను ఆదేశించారు.

అప్పటి నుంచి అక్కడే పని చేస్తున్న ఈటల 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఉద్యమ అవసరాల కోసం 2008, 2010లో రాజీనామా చేసారు. ఉప ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్ నియోజకవర్గం రద్దైంది. కోత్తగా హుజూరాబాద్ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది.

అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు హుజూరాబాద్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. వరుసగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సాధించిన ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో కేసీఆర్ రెండో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story