హుజురాబాద్‌లో హీటెక్కిస్తున్న ఎన్నికల ప్రచారం..!

హుజురాబాద్‌లో హీటెక్కిస్తున్న ఎన్నికల ప్రచారం..!
హుజురాబాద్‌లో ఉపఎన్నికల తేదీలు ఖరారుకాకుండానే...అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం హీటెక్కిస్తోంది.

హుజురాబాద్‌లో ఉపఎన్నికల తేదీలు ఖరారుకాకుండానే...అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం హీటెక్కిస్తోంది. ప్రచారంలో ఎవరు ఏ మాత్రం వెనక్కి తగ్గటంలేదు. గెలిచేది మేమేనంటూ సవాల్‌, ప్రతిసవాళ్లు విసురుతున్నారు. అటు నేతల సతీమణులు ప్రచార పర్వంలో ముందు వరుసలో దూసుకపోతున్నారు.

అభివృద్ధి అస్త్రాలతో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా మంత్రి హరీశ్‌రావు అన్నితానై. హుజురాబాద్‌ ఎన్నికల ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌...ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఈటల వ్యవహారం ఉందని హరీష్‌రావు ఆరోపించారు.

ఈటెల రాజేందర్ గెలిస్తే..నియోజకవర్గానికి ఏం ప్రయోజనం జరుగుతుందని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. దళిత బంధు పథకంపై అవాకులు చెవాకులు పేలుతున్న ఈటల... రైతు బంధు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీకాలనీలో మీడియాతో మాట్లాడిన తలసాని.. ఈటల రాజేందర్‌పై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్‌యాదవ్ మృతికి మాజీ మంత్రి ఈటల, పోలీసుల వేధింపులే కారణమని... టీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్. జురాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు పోటీ చేసి గెలిస్తే...తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు ఈటల. కేసీఆర్‌ పాలనపై 84 శాతం జనాలు వ్యతిరేకంగా ఉన్నారని ఇండియాటుడె సర్వే చెబుతుందన్నారు.

హుజురాబాద్‌లో హీటెక్కిస్తున్న ఎన్నికల ప్రచారంతో...రాజకీయముఖ చిత్రం మారుతోంది. ప్రధాన పార్టీల నేతలు స్థానికంగానే మాకం వేశారు. గెలుపే ధ్యేయంగా అటు టీఆర్‌ఎస్, బీజేపీలు స్థానికంగా పావులు కదుపుతుండటం ఉత్కంఠ రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story