Etela Jamuna : రాజకీయ అక్కసుతోనే మాజీ మంత్రి ఈటలపై ఆరోపణలు: జమున

Etela Jamuna : రాజకీయ అక్కసుతోనే మాజీ మంత్రి ఈటలపై ఆరోపణలు: జమున
Etela Jamuna : రాజకీయ అక్కసుతోనే మాజీ మంత్రి ఈటలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన భార్య ఈటల జమున.

Etela Jamuna : రాజకీయ అక్కసుతోనే మాజీ మంత్రి ఈటలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన భార్య ఈటల జమున. 2004 నుంచి ఈటల రాజకీయాల్లో ఉన్నారని, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ అధికారికైనా ఫోన్ చేశారా అని ప్రశ్నించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారిపై కేసులు పెడుతామని హెచ్చరించారు. కలెక్టర్ హోదా మరచి మాట్లాడారని ఆరోపించారు. సర్వే నంబర్‌ 81లో 5 ఎకరాల 30 గుంటలు, 130 సర్వే నంబర్‌లో 3 ఎకరాలు ఉంటే 70 ఎకరాలు ఆక్రమించామనడం ఏంటన్నారు. 2018లోనే భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా హేచరిస్‌ ఏ అనుమతులైతే ఉన్నాయో...తమకు అవే పర్మిషన్స్ ఉన్నాయన్నారు. ఈటలను రోడ్డున వేయాలన్నదే కేసీఆర్ టార్గెట్ అన్నారు జమున. తన బండారాన్ని ఈటల బయటపెడతాడని...కేసీఆర్ భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం మొత్తం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం సరికాదన్నారు జమున.

Tags

Read MoreRead Less
Next Story