ఈటెల ఇప్పుడే బీజేపీలో చేరుతారా..? కొన్నాళ్ళు ఆగుతారా..?

ఈటెల ఇప్పుడే బీజేపీలో చేరుతారా..? కొన్నాళ్ళు ఆగుతారా..?
బీజేపీలో చేరేందుకు మానసికంగా సిద్ధమైపోయిన ఈటెల రాజేందర్ తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీజేస్ అధ్యక్షుడు కోదండరాం సమావేశం అవ్వడం ఆసక్తికరంగా మారింది.

బీజేపీలో చేరేందుకు మానసికంగా సిద్ధమైపోయిన ఈటెల రాజేందర్ తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీజేస్ అధ్యక్షుడు కోదండరాం సమావేశం అవ్వడం ఆసక్తికరంగా మారింది. తొందరపాటు లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేద్దామనే ప్రతిపాదన వారి నుంచి వచ్చిన.. ఈటెల ఎటు తెలుచుకొలేకపోతునట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలతోనూ దాదాపు గంట పాటు సమావేశమైన ఈటెల.. జూన్ మొదటి వారంలో తన నిర్ణయం తాను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ప్రస్తుతం ఆయన పై రాజకీయంగానూ.. కేసులో రూపాల్లోనూ తీవ్రమైన ఒత్తిడి ఉంది. దీన్ని తట్టుకోవాలి. క్యాడర్ ను, అనుచరులను కాపాడుకోవాలి. అలాగే హుజూరాబాద్ బై పోల్లో మళ్ళీ గెలవాలి. స్వతంత్రంగా పోటీ చేస్తే అక్కడ్నుంచి గెలవాలని భావిస్తున్నా.. అందుకు అన్ని పార్టీల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందో తెలియదు. మరోవైపు తనపైన కుమారుడు పైన కేసులు ఆర్థికంగానూ దెబ్బతీసే ప్రయత్నాలు ఈటెలను ప్రేజర్ లోకి నెట్టేస్తున్నాయని అంటున్నారు. ఇలాంటివన్నీ తట్టుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సపోర్ట్ కావాల్సిందేనని అభిప్రాయానికి ఈటెల వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

అయితే ఆయన బీజేపీలో చేరితే అనర్హత తప్పదు. అప్పుడు బైపోల్ వచ్చిన వ్యక్తిగతంగా తనకు ఉన్న ఇమేజ్ తో పాటు బీజేపీ సపోర్ట్ ఉంటుందని తోడవుతుందని ఈటెల భావిస్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం హిందుత్వానికి మద్దతు పలుకుతుంది కాబట్టి అది తనకి మరింత ప్లస్ అవుతుందని లెక్కల్లో ఉన్నారు. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే కమలం పార్టీలో చేరడమే మార్గమని ఈటెల భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో తొందరపాటు అవుతుందని కోదండరాంతో పాటు మరికొందరు నేతలు సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఎమ్మెల్యేగా ఈటెల రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వారంటున్నారు. ప్రస్తుతానికి వేచి చూసి తర్వాత నిర్ణయం తీసుకోవాలని వారు అంటున్నారు.

వచ్చే రెండేళ్లలో దేశంలోనూ , రాష్ట్రంలోనూ బీజేపీ గ్రాఫ్ కూడా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తొందరపడి బీజేపీ లోకి వెళ్లడం ఎందుకు అనే సలహా కూడా ఈటెలకి ఇస్తున్నారు. రేపటి పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడి తట్టుకోవాలంటే జాతీయ పార్టీ మద్దతు కావాల్సిందేనని ఈటెల భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్లి నడ్డాను కలుస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. అటు ఈటెలతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన.. కొండ విశ్వేశ్వర రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుపై తమకేమీ తొందర లేదన్నారు ఆరోపణలు వచ్చినప్పుడు ఈటెల ను సస్పెండ్ చేయొచ్చు కదా అని కేసీఅర్ ను ప్రశ్నించారు.

కేసులు పెట్టి వేధింపులకి గురి చేయడం సరికాదని ఈ విషయంలో తామంతా ఈటేలకి మద్దతుగా ఉంటామని చెప్పారు. అటు ఈటెల పై దాడి తెలంగాణ ఆత్మగౌరవం పై జరిగిన దాడి గానే చూస్తున్నామన్న కోదండరాం.. కేసీఅర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి ఒక్కరూ తన చెప్పుచేతల్లో నే పని చేయాలన్న నియంతృత్వం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి అనైతికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.



Tags

Read MoreRead Less
Next Story