Eetela Jamuna: తమ్ముడు.. తమ్ముడు అంటూనే తడి బట్టతో గొంతు కోశారు: ఈటెల జమున

Eetela Jamuna: తమ్ముడు.. తమ్ముడు అంటూనే తడి బట్టతో గొంతు కోశారు: ఈటెల జమున
కొనుగోలు చేసిన భూమి కంటే ఒక్క ఎకరా ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా.. సర్వే చేసిన అధికారులు అందుకు సిద్ధమేనా అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున అన్నారు.

Eetela Jamuna: కొనుగోలు చేసిన భూమి కంటే ఒక్క ఎకరా ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా.. సర్వే చేసిన అధికారులు అందుకు సిద్ధమేనా అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున అన్నారు.

హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె అక్రమాలు జరిగినట్లు నిరూపించాలని ఆమె అన్నారు. తన ఆత్మగౌరవ పోరాటంలో దేనికైనా తాను సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. అధికారం ఉందని ఏం చేసిన చెల్లుతుందని అనుకోవడం పొరపాటని అన్నారు.

ఉద్యమంలోకి రాకముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంతో చెప్పాలని అన్నారు. అందుకు ఆయన చర్చకు సిద్ధమేనా అన్నారు. సమైక్యాంధ్రలో ఆత్మగౌరవంతో ఉన్నామని బతికామని అన్నారు. 2014 నుంచి ఆ పరిస్థితి లేదని అన్నారు.

ఈటెల రాజేందర్ చేస్తున్న ఆత్మగౌరవ పోరాటం కోసం యావదాస్తి అమ్ముకోవడానికి తాను సిద్ధమేనని అన్నారు. ఉద్యమంలో ఈటెల పెట్టిన డబ్బు గురించి ఎవరైనా అడిగారా అని ఆమె అన్నారు. నేను వ్యాపారం చేస్తూ రాజేందర్ ను ఉద్యమంలోకి పంపాను.

ప్రభుత్వాలు ఉన్నప్పుడు న్యాయం వైపు మాట్లాడాలి. ధర్మం వైపు మాట్లాడాలి అని అన్నారు. ఒక దశలో కంటి తడి పెట్టుకుని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు.




Tags

Read MoreRead Less
Next Story