బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది..వింధ్యా ఆర్గానిక్స్‌లో పొగలు దట్టంగా ఎగిసిపడుతున్నాయి. రియాక్టర్ పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న గాయాలతో ఆహాకారాలు చేస్తున్నారు. అటు మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ముందుజాగ్రత్తగా వింధ్యా ఆర్గానిక్స్‌ పక్కన ఉన్న పరిశ్రమల్ని కూడా ఖాళీ చేయిస్తున్నారు.

ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ నంచి భారీ పేలుడు శబ్ధం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. కార్మికులు భయంతో పరుగులు తీశారు. మరికొందరు లోపలే చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విపరీతమైన వేడి, దట్టమైన పొగల కారణంగా ప్రస్తుతం ఫ్యాక్టరీలోకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story