Fire Accident: సికింద్రాబాద్ గోడౌన్ లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి..

Fire Accident: సికింద్రాబాద్ గోడౌన్ లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి..
Fire Accident:అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో గోడౌన్ లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

Fire Accident: బ్రతుకుదెరువు కోసం బీహార్ నుంచి వచ్చారు.. అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో మంటలకు ఆహుతి అయ్యారు. బోయిగూడలోని ఓ స్క్రాప్ గోడౌన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు.

అగ్నిమాపక అధికారులు అందించిన సమాచారం మేరకు.. బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో మంటలు చెలరేగినట్లు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో హుటాహుటిన ప్రమాద స్థలానికి ఆరు ఫైరింజన్లు పంపించారు.

మంటలను అదుపు చేసిన తర్వాత గోడౌన్ పై అంతస్థులోకి వెళ్లారు. అక్కడ ఉన్న రెండు గదుల్లో కార్మికులు నివసిస్తున్నారు. వారంతా పనులు పూర్తైన తర్వాత గదుల్లో నిద్రపోయారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో గోడౌన్ లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

వారంతా ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో ముందు వైపు ఉన్న గది నుంచి రెండో గదిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.. ఎందుకంటే మృతదేహాలన్నీ ఆ గదిలోనే లభ్యమయ్యాయి. మృతదేహాలన్నీ గుర్తుపట్టరాని విధంగా ఉన్నాయని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.

మొత్తం 12 మంది కార్మికులు ఉండగా అందులో ఒక వ్యక్తి మాత్రం కిటీకి నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.. ప్రస్తుతం అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో ఇలాంటి అనుమతులు లేని స్క్రాప్ గోడౌన్ లు ఎన్ని ఉన్నాయన్న దానిపై వివరాలు సేకరించి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తామని మంత్రి తలసాని తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story