Gay Marriage: మా కల నెరవేరింది.. మేం పెళ్లి చేసుకున్నాం

Gay Marriage: మా కల నెరవేరింది.. మేం పెళ్లి చేసుకున్నాం
Gay Marriage: ఒక ప్రైవేట్ వేడుకలో స్వలింగ సంపర్కులు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

Gay Marriage: ఓ అమ్మాయి, ఓ అబ్బాయి పెళ్లి చేసుకుంటే అందులో వింతేముంది. ఓ అబ్బాయి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అది కదా అసలు వార్త. ప్రేమలు ఎలా పుడతాయో చెప్పలేం కానీ,, పెళ్లి మాత్రం ముందే ఫిక్సయి ఉంటుందంటారు.. ఎంత వరకు నిజమో మరి.

భారతదేశంలో స్వలింగ వివాహాలు చట్టవిరుద్ధం. కానీ హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో స్వలింగ సంపర్కులు అధికారికంగా వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 18న హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో స్వలింగ సంపర్కులు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. దాదాపు 60 మంది కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో వీరిరువురు ఉంగరాలు మార్చుకున్నారు.

హైదరాబాద్‌లోని ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీలో భాగమైన సోఫియా డేవిడ్ అనే స్నేహితురాలు వీరి వివాహ వేడుకను నిర్వహించింది. తమ బంధాన్ని ప్రకటించినప్పటి నుండి ప్రజల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయని చెప్పారు. వివాహ ఆచారాలు లేదా లాంఛనాలు లేనప్పటికీ, ఈ జంట బెంగాలీ మరియు పంజాబీ సంప్రదాయాలను అనుసరించారు. హైదరాబాద్‌కు చెందిన కొందరకు ట్రాన్స్‌జెండర్ మహిళలు ఈ వేడుకకు హాజరై ఇద్దరినీ ఆశీర్వదించారు.

వివాహం చేసుకుంటున్నట్టు గత అక్టోబర్‌నే ప్రకటించారు. పలువురు వీరి వివాహానికి మద్దతు పలికారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా వాళ్ల మ్యారేజ్‌కి మద్దతు పలికింది. ఈ జంటకు అభినందనలు తెలిపింది.

సుప్రియో చక్రవర్తి, అభయ్‌లకు తామిద్దరం గేలమని చిన్నప్పుడే తెలిసిందట. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సుప్రియో హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన అభయ్ ఐటీ ప్రొఫెషనల్. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఇద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం పరిచయమైంది.. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు వివాహంతో ఒక్కటయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story