గ్రేటర్ ఎన్నికలు : 55 స్థానాలకు పడిపోయిన టీఆర్ఎస్

గ్రేటర్ ఎన్నికలు : 55 స్థానాలకు పడిపోయిన టీఆర్ఎస్

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో... టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. 2016 ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి 55 స్థానాలకు పడిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. 2016 ఎన్నికల్లో 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ .. ఈ సారి ఏకంగా 48 స్థానాలను దక్కించుకుంది. ఇక... గతంతో పోలిస్తే ఎంఐఎం తన 44 స్థానాలను నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది . కేవలం రెండు సీట్లలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీతో అభ్యర్థులు గెలుపు సాధించారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మంచి పోటీ ఇచ్చింది బీజేపీ. అయితే.. ఈ ఎన్నికల్లో అధికారానికి కావాల్సిన సీట్లను ఏ పార్టీకి కూడా దక్కించుకోలేదు. తప్పనిసరిగా సెంచరీ కొడతామంటూ చెప్పిన టీఆర్ఎస్‌కు ఓటర్లు చుక్కలు చూపించారు. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే 76 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ... ఏ ఒక్క పార్టీ కూడా 60 దాటలేదు. దాంతో హంగ్‌ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఎంఐఎం మద్దతుతో మేయర్‌ పీఠం టీఆర్ఎస్ దక్కించుకోనుందనే ప్రచారం జరుగుతోంది. 2016 ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితైన బీజేపీ తాజాగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story