జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం..!

జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం..!
జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బల్దియాకు రికార్డుస్థాయిలో పన్ను వసూలు అయ్యాయి.

జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బల్దియాకు రికార్డుస్థాయిలో పన్ను వసూలు అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం 19 వందల కోట్లు నిర్దేశిత లక్ష్యం కాగా.. బుధవారం రాత్రి వరకు ఒక వెయ్యి 701 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలు అయినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజులోనే సుమారు 40 కోట్లకు పైగా ఆస్తి పన్నులు వసూలయ్యాయని వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 12 లక్షల 20 వేల మంది ఆస్తిపన్నులు చెల్లించారని అధికారులు పేర్కొన్నారు. గతేడాది కంటే ఈసారి 229 కోట్ల రూపాయలు అదనంగా వసూళ్లు అయినట్లు స్పష్టంచేశారు. కాగా గతేడాది 10 లక్షల 50 వేల మంది నుంచి సుమారు 14 వందల 72 కోట్ల వరకు పన్ను రాబట్టారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపు గడువు బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది.

దీంతో ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేయడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లింపులతో నగరంలో మీసేవ, జీహెచ్‌ఎంసీ సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు రద్దీగా మారాయి. కరోనా తీవ్రత, గతేడాది రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు, వరుసగా ఎన్నికలు రావడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ రికార్డుస్థాయిలో పన్నులు వసూలు కావడంపై గ్రేటర్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story