ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఛాయిస్ చాలా..

ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఛాయిస్ చాలా..
అయితే ఈ సారి నిర్వహించే ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నా పత్రాల్లో విద్యార్ధులకు

కరోనా సీజన్ కాలేజీలు తెరవాలంటే ఇంకా ధైర్యం చాలట్లేదు.. కొన్ని పాఠశాలలు, కళాశాలలు ఇప్పటికే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తూ విద్యా సంవత్సరాన్ని వృధా కానివ్వకుండా చూస్తున్నారు. ఆన్‌లైన్ పాఠాలు, పరీక్షలు నిర్వహిస్తూనే విద్యార్థులను ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.

అయితే ఈ సారి నిర్వహించే ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నా పత్రాల్లో విద్యార్ధులకు ఛాయిస్ మరింత పెంచనున్నారు. ప్రస్తుతం ఇంటర్‌లో షార్ట్ ఆన్సర్ ప్రశ్న్లల్లో అసలు ఛాయిస్ లేదు. మిగిలిన షార్ట్, లాంగ్ ఆన్సర్ ప్రశ్నల్లో కొంత ఛాయిస్ ఉంది. ఉదాహరణకు మ్యాథ్స్ పేపర్‌లో మూడు భాగాలు ఉంటాయి. అందులో 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి.

4 మార్కుల ప్రశ్నలు 7 ఇస్తే 5 రాయాల్సి ఉంటుంది. 7 మార్కుల లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు 7 ఇస్తే 5 రాయాల్సి ఉంటుంది. చివరి రెండు సెక్షన్లకు ఛాయిస్ మరింత పెంచనున్నారు. అంటే 10 వరకు ప్రశ్నలు ఇస్తే అందులో 5 ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాసేలా ఉండొచ్చని సమాచారం. ఇతర సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు కూడా ఇదే తరహాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దాని వల్ల విద్యార్థులు మరింత సులభంగా పరీక్షలు రాయగలుగుతారని అధికారులు భావిస్తున్నారు. సైన్స్ గ్రూపు విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయని ఓ అధికారి తెలిపారు.

ఫైనల్ పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో పరీక్ష ఫీజు వసూలుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు దాదాపు 9.50 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story