Harish Rao: కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో హరీష్‌రావు ఆకస్మిక తనిఖీ.. డాక్టర్‌ సస్పెండ్..

Harish Rao: కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో హరీష్‌రావు ఆకస్మిక తనిఖీ.. డాక్టర్‌ సస్పెండ్..
Harish Rao: హైదరాబాద్‌ కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్‌రావు

Harish Rao: హైదరాబాద్‌ కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్‌రావు.. ఒక డాక్టర్‌ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్ కోసం.. డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితులు మంత్రి హరీష్‌రావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే వివరాలు అడిగి తెలుసుకున్న హరీష్‌రావు.. ఆ డాక్టర్‌పై అక్కడిక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

గైనకాలజి వార్డులో సదుపాయాలను పరిశీలించిన మంత్రి.. ప్రతి రోజూ స్కానింగ్ జరగాల్సిందేనని ఆదేశించారు. అదనంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో 60 శాతం పైగా సాధారణ కాన్పులు కావడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో తిరుగుతూ వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయి అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీష్‌రావు.

Tags

Read MoreRead Less
Next Story