తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరుపున ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ధర్మాసనానికి వివరించారు.

తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తారా..? లేక కర్ఫ్యూ పెడతారా..? తేల్చుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో ఓవైపు కరోనా తీవ్రత, మరోవైపు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సరైన వివరాలు వెల్లడించలేదన్న హైకోర్టు.. నివేదిక అంతా తప్పుల తడకే అని పేర్కొంది.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరుపున ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ధర్మాసనానికి వివరించారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా థియేటర్లు, బార్లు, పబ్‌ల్లో రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగింది హైకోర్టు. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న ఏజీ వ్యాఖ్యలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు గాల్లో వేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు.

తెలంగాణలో గతేడాది పరిస్థితులే ఈసారి కూడా కనబడుతున్నాయి. రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్, బెడ్ కొరతతో రోగులు అల్లాడిపోతున్నారు. అనేక మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు. ప్రజల ప్రాణాల కంటే పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని నిలదీసింది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా..? లేక హైకోర్టే ఆదేశాలు ఇవ్వమంటారా అని ధర్మాసనం మండిపడింది. 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story